
తమిళనాడు: సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి చెరలో ఉన్న ముగ్గురు యువతులకు విముక్తి కలిగించారు. తిరువళ్లూరు జిల్లా శివందినగర్ ప్రాంతంలోని సలూన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ మల్లికకు రహస్య సమాచారం అందింది.
దీంతో పోలీసులు మంత్ర సలూన్‌లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చైన్నెకు చెందిన రాజేష్(47) అన్ననూర్‌కు చెందిన గాయత్రి(23)లను అరెస్టు చేశారు. వీరి చెరలో ఉన్న ముగ్గురు యువతులను రిమాండ్‌కు తరలించారు. కాగా పరారీలో ఉన్న విఘ్నేష్ అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment