నా ఆర్డర్ భయ్యా.. నువ్వు తినేస్తున్నావేంటి -కస్టమర్
మరి ఏం చేయాలి? ఏం చేసుకుంటావో చేస్కో- డెలివరీ ఏజెంట్
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్‌లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది.
విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్‌సైకిల్‌పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్‌ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్‌కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్‌కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్‌పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్‌లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment