సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పార్కింగ్ సౌకర్యం సరిగ్గాలేని 20 పబ్బులు, కాఫీషాప్‌లకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడు రోజులక్రితం జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఓ పబ్‌ముందు పార్కింగ్ చేసిన కారు కారణమని రాత్రి వేళల్లో రోడ్డకు రెండువైపులా అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో పంజగుట్ట ట్రాఫిక్ ఎసీపీ కోటేశ్వరరావు నేతృత్వంలో పోలీసులు నోటీసులు అందచేశారు. తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించకపోతే వాటిని సీజ్‌చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్కింగ్ సౌకర్యం కల్పించుకున్న దానిపై వివరణ ఇవ్వాలని కోరారు.
మహిళా సంఘాల ధర్నా
పబ్‌ల ముందు రోడ్లకు రెండువైపులా అర్ధరాత్రిదాకా వాహనాలు పార్కింగ్‌చేస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారని ఆరోపిస్తూ మహిళాసంఘాలు బుధవారం జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 45 లోని ఫ్యాట్ ఫిజియన్ పబ్‌తో పాటు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 30లో ఉన్న హైలైఫ్ 800 పబ్ ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్డదిడ్డంగా కార్లు పార్కింగ్ చేయడంవల్ల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్కింగ్ సౌకర్యం లేకుండానే పబ్‌లు ఎధేచ్చగా నడుస్తున్నా పోలీసులు పట్టించు కోవడంలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment