
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని 10 పబ్‌లకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ అనుమతి ఇచ్చేది లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. పబ్‌లపై గతంలో హైకోర్టు ఈ ఆదేశాలివ్వగా.. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్స్ నిర్వాహకులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గతంలో పబ్‌ల విషయంలో ఇచ్చిన తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. న్యూఇయర్ సందర్భంగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. రాత్రి 10 గంటల తరువాత మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గత ఆదేశాల ప్రకారమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
చదవండి: New Year Celebrations: కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది జాగ్రత్త..!
Comments
Please login to add a commentAdd a comment