Excitement On New Year Celebrations In Hyderabad Pubs Over Omicron Scare - Sakshi
Sakshi News home page

Hyderabad: న్యూఇయర్‌ వేడుకలపై ఉత్కంఠ

Published Tue, Dec 28 2021 10:41 AM | Last Updated on Tue, Dec 28 2021 3:21 PM

Excitement Over New Year Celebrations in Hyderabad Telangana - Sakshi

జూబ్లీహిల్స్‌లోని వైట్‌ రాబిట్‌ పబ్‌పై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. సిటీలోనే బిగ్గెస్ట్‌ పార్టీ సెంటర్‌గా పేరున్న గచ్చిబౌలిలోని ప్రిజమ్‌ పబ్‌పైనా దాడి చేశారు. అలాగే నివాసాల మధ్య న్యూసెన్స్‌ పేరిటా పలు పబ్స్‌పై రైడ్స్‌ జరిగాయి. న్యూ ఇయర్‌ వేడుకల్ని అదుపు చేయడానికే ఈ రైడ్స్‌ అనేది తెలుస్తోంది. అయితే వీటిని పట్టించుకోకుండా కొన్ని పబ్స్‌ పార్టీస్‌కి సై అంటుంటే మరికొన్ని సైలెన్స్‌ని ఆశ్రయించాయి. హోటల్స్, రిసార్ట్స్‌లు న్యూ ఇయర్‌ వేడుకలకు దూరంగా ఉంటున్నా పబ్స్‌ మాత్రం నిబంధనలకు లోబడి నిర్వహిస్తామంటూన్నాయి. ఏతావాతా న్యూ ఇయర్‌ వేడుకలు పోలీస్‌ వర్సెస్‌ పార్టీస్‌గా మారిన పరిస్థితుల్లో పార్టీ ప్రియులూ...పారా హుషార్‌.     –సాక్షి, సిటీబ్యూరో 

సాధారణంగా ప్రతి న్యూ ఇయర్‌ ఈవెంట్‌కి ఓ వారం ముందుగానే వేడుకలు మొదలవుతాయి. అయితే కరోనా వల్ల గత ఏడాది సందడి కనుమరుగైంది. ఈ ఏడాది కరోనా లేదనుకుంటూ..ఫుల్‌ జోష్‌కు రెడీ అయిన సిటీ పార్టీపై ఒమిక్రాన్‌ అకస్మాత్తుగా దాడి చేసింది. దీంతో కొన్ని పార్టీ ప్లేస్‌లేమో సైలెంట్‌ అయిపోగా మరికొన్ని మాత్రం మాదే ఈవెంట్‌ అంటున్నాయి. 



వెల్‌కమ్‌...పార్టీస్‌.. 
ఎక్స్‌ప్లోజన్, అబ్రకదబ్ర, ఐయామ్‌ స్పుత్నిక్‌ ఎట్‌ బఫెలో వైల్డ్‌ వింగ్స్‌...తదితర ఆసక్తికరమైన పేర్లతో సిటీలో ఉన్న కొన్ని పాపులర్‌ పబ్స్‌ అన్నీ ఇప్పటికే న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ని ప్రకటించేశాయి. కొన్ని అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా ప్రారంభించేశాయి. బయటి నగరాల నుంచే కాక విదేశీ డీజేలను కూడా రప్పిస్తున్నాయి.  

చదవండి: (గుండెల్ని పిండే ఘటన: అమ్మా లే అమ్మ.. అమ్మా లే అమ్మ!)

కార్పొరేట్‌...హార్ట్‌ బీట్‌... 
అత్యధిక సంఖ్యలో పబ్స్‌ అది కూడా యువతను ఆకట్టుకునేవి ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలు ముందు వరుసలో ఉంటాయి. ఎప్పుడూ కిక్కిరిసిన పార్టీ యానిమల్స్‌తో కళకళలాడే ఈ పబ్స్‌కి కార్పొరేట్‌ ఉద్యోగులే ప్రధాన పోషకులు. వీరికి పబ్బింగ్‌ అనేది దినచర్యలో ఒక భాగం కాగా న్యూ ఇయర్‌ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్‌. విభిన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, కుటుంబాలకు దూరంగా గడిపే వారు సహజంగానే న్యూ ఇయర్‌ పార్టీస్‌ కోసం పబ్స్‌ను ఆశ్రయిస్తారు.  వీరిని నిరాశపరచకుండా కొత్త సంవత్సరారంభానికి వారం ముందే  పబ్స్‌ పార్టీల పరంపర కొనసాగిస్తుంటాయి.

 

ముందస్తు ఏర్పాట్లే...వెనుకడుగుకు పోట్లు 
న్యూ ఇయర్‌ పార్టీస్‌ కోసం అంతర్జాతీయ స్థాయి డిజెలను సెలబ్రిటీలను నగరంలోని పబ్స్‌ ముందస్తు అడ్వాన్స్‌లు ఇచ్చి పోటా పోటీగా బుక్‌ చేసుకుంటాయి. కనీసం నెల, నెలన్నర ముందుగానే ఈ కాంట్రాక్ట్‌లు ఫిక్స్‌ అయిపోతాయి. ఈవెంట్స్‌ క్యాన్సిల్‌ అయితే పెద్ద మొత్తాలనే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకని వీలున్నంత వరకూ పార్టీల్ని నిర్వహించడానికే సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా వరుస ప్రీ ఈవెంట్స్‌ నిర్వహిస్తున్న ప్రిజమ్‌ పబ్‌.. ఓ వైపు పోలీసు రైడ్స్‌ జరిగినా పట్టించుకోకుండా షెడ్యూల్‌ ప్రకారం తదుపరి ఈవెంట్స్‌కి రెడీ అయిపోతోందని తెలుస్తోంది.     ఏదేమైనా.. న్యూ ఇయర్‌ పార్టీలపై పోలీస్‌ దాడులు, నిబంధనలను పబ్బుల బేఖాతరు కొనసాగే పరిస్థితులున్నాయి. కాబట్టి... గత ఏడాదిలా సన్నిహితులతో ఇంట్లోనే వేడుకలు జరుపుకోవడం సిటిజనులకు అన్ని రకాలుగా శ్రేయోదాయకం అని చెప్పక తప్పదు.  

చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)

డౌట్‌ ఫుల్‌...కోవిడ్‌ ప్రొటోకాల్‌... 
నగరంలో ఉన్న మోస్తరు పబ్‌లో సగటున 300 నుంచి 500 మంది వరకూ ఆతిథ్యం ఇవ్వొచ్చు. ఇక ప్రిజమ్, బ్లాక్‌ 22 వంటి పెద్ద పబ్స్‌ అయితే 2 వేల మంది వరకూ హాజరు కావచ్చు. ఈ పబ్స్‌లో ఈవెంట్స్‌ నిర్వహించేటప్పుడు సోషల్‌ డిస్టెన్సింగ్‌ అనేది అసాధ్యమే. కాబట్టే పోలీసులు ఈసారి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై డేగ కన్నేస్తున్నారు. తాము కోవిడ్‌ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నామని, 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రం అనుమతిస్తున్నామని చెబుతున్నా అది జరిగే పనికాదని ఓ ప్రముఖ డి.జె ‘సాక్షి’తో స్పష్టం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement