హైదరాబాద్: న్యూ ఇయర్ రోజు మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈవెంట్స్, పబ్ లకు అనుమతి ఉంటుందని తెలిపారు. రాత్రి 12.30 నుండే కస్టమర్లను పబ్‌ల నుంచి బయటికి పంపాలని ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిఘా ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించిన, సప్లై చేసిన కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్ సప్లై, డిమాండ్ పై ఫోకస్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకునేందుకు రెండు స్నీపర్ డాగ్స్‌కు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నా వెతికి అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment