
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్‌డౌన్‌లో భాగంగా బ్రిటన్‌లోని పబ్‌లన్నింటిని మూసివేయడం జరిగింది. దీంతో దాదాపు రూ. 7 కోట్ల పింట్ల బీరు వృధా అవుతోంది. మార్చి 20వ తేదీన మూతపడిన పబ్‌లు జూలై నాలుగవ తేదీన తెరచుకోనున్నాయి. ఈ కారణంగా పబ్స్‌లో రూ. 7 కోట్ల పింట్ల బీరు నిల్వ ఉండి పోయిందని, అవి తెరచుకునే నాటికి బీరు ఎందుకు పనికి రాదని బ్రిటన్ బీర్ అండ్ పబ్ అసోసియేషన్ తెలిపింది. (కరోనాకు ‘క్యూర్’ ఉందన్న శాస్త్రవేత్తలు)
అయితే మిగిలి పోయిన బీరులో కొంత భాగాన్ని సేంద్రీయ వ్యవసాయంలో ఎరువుల కోసం, జంతువుల దాణ కోసం ఉపయోగించవచ్చని అసోసియేషన్ చీఫ్ ఎమ్మా మార్క్‌క్లార్కిన్ తెలిపారు. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యవసాయాన్ని ఈ రకంగా ఆదుకునేందుకు బీరు ఉపయోగపడడం సంతోషకరమైనప్పటికీ పబ్‌లకు బారీ నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బీరు తయారీ కేంద్రాలను, పబ్‌లను కొంత మేరకైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ. 7 కోట్ల పింట్ల బీరు విలువ బ్రిటన్‌లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!)
Comments
Please login to add a commentAdd a comment