ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్‌ వేవ్ | Corona Is Mostly For Men In IT Capital City Of Bangalore | Sakshi
Sakshi News home page

ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్‌ వేవ్

Published Thu, Mar 25 2021 2:10 AM | Last Updated on Thu, Mar 25 2021 2:17 PM

Corona Is Mostly For Men In IT Capital City Of Bangalore - Sakshi

సాక్షి, బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో మహిళల కంటే పురుషులకే అధికంగా కరోనా వైరస్‌ సోకుతోంది. మాస్క్‌ వినియోగించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళలతో పోలిస్తే బయట తిరిగేది ఎక్కువ మగవారే కావడంతో కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో 3,364 మంది పురుషులకు, 2,334 మంది మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారించారు. వారంరోజుల నుంచి కర్ణాటకలో కరోనా రెండో ఉధృతి ప్రారంభమైందనడానికి సూచికగా నిత్యం 1500 లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నియమాలను మహిళల కంటే పురుషులే అధికంగా ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌లు, రెస్టారెంట్లు, సభలు, సమావేశాలు, వివాహాలు, రెస్టారెంట్లలో ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారు. 


మొదలైన సెకెండ్‌ వేవ్‌..
ఈ ఏడాది (2021) ఆరంభమైన తర్వాత తొలిసారిగా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండు వేల మార్క్‌ దాటింది. గత వారం రోజులుగా వెయ్యి పైగా పాజిటివ్‌లు నిర్ధారిస్తున్నారు. గతంలో 2020 నవంబరు 14వ తేదీన 2,154 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మార్చి 24వ తేదీన రెండు వేల మార్కు దాటింది. ఈ నెలారంభంలో 5,800గా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య.. 23వ తేదీ నాటికి 15 వేలు దాటింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement