Virat Kohli Becomes 1st Asian To Cross 250 Million Followers On Instagram, Deets Inside - Sakshi
Sakshi News home page

Kohli Instagram Followers: 'కింగ్‌' కోహ్లి రికార్డు.. ఆసియా ఖండం నుంచి ఒకే ఒక్కడు

Published Thu, May 25 2023 1:02 PM | Last Updated on Thu, May 25 2023 2:19 PM

Virat Kohli Becomes 1st-Asian Cross 250 Million Followers-Instagram - Sakshi

టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లి అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అయితే ఆటలో మాత్రమే అతను కింగ్‌ అనిపించుకోవడం లేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల విషయంలోనూ కోహ్లి తనకు తానే సాటి. ఇటీవలే ఐపీఎల్‌ రెండు వరుస శతకాలతో అభిమానులను అలరించిన కోహ్లి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 250 మిలియన్‌ ఫాలోవర్లను సంపాదించాడు. ఆసియా ఖండం నుంచి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కోహ్లి నిలిచాడు. 

టీమిండియా తరపున ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గానూ కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. కోహ్లి తర్వాత ఎంఎస్‌ ధోని 42.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక టీమిండియా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 40.3 మిలిమిన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

ఇక పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ కలిగిన క్రీడాకారుడిగా నిలిచాడు. రొనాల్డోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అ‍య్యేవారి సంఖ్య 585 మిలియన్‌. రొనాల్డో తర్వాత లియోనల్‌మెస్సీ 462 మంది మిలియన్‌ ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ చేరడంలో మరోసారి విఫలమైంది. సీజన్‌లో మంచి విజయాలు నమోదు చేసినప్పటికి ఆర్‌సీబీ ప్లేఆఫ్‌లో అడుగుపెట్టలేదు. అయితే కోహ్లి మాత్రం రెండు సెంచరీలు సహా ఐదు అర్థసెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించి తన సూపర్‌ఫామ్‌ను కంటిన్యూ చేశాడు.

చదవండి: కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్‌ ఉల్‌ హక్‌

ఒక 'SKY' మరో 'స్కై'తో.. 'వదిలితే 10 వికెట్లు తీస్తావా?'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement