ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ కథ ముగిసింది. ఆదివారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీతో శుబ్‌మన్ గిల్ కదం తొక్కడంతో 198 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ గెలవడంతో ఆర్‌సీబీ ఇంటిబాట పట్టగా.. ముంబై ఇండియన్స్ నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది.
11 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 102/1
11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 47, విజయ్ శంకర్ 32 పరుగులతో ఆడుతున్నారు. గుజరాత్ విజయానికి 54 బంతుల్లో 96 పరుగులు కావాలి.
7 ఓవర్లలో గుజరాత్ స్కోరు 59/1
ఏడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 21, విజయ్ శంకర్ 18 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన సాహా సిరాజ్ బౌలింగ్‌లో పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కోహ్లి సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 198
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 101 పరుగులతో సెంచరీతో మెరిశాడు.
దినేశ్ కార్తిక్ గోల్డెన్ డక్.. ఆర్‌సీబీ 136/5
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. యష్ దయాల్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 63, అనూజ్‌రావత్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు.
విరాట్ కోహ్లి ఫిఫ్టీ.. 13 ఓవర్లలో ఆర్‌సీబీ 127/3
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కోహ్లి 57, మైకెల్ బ్రాస్‌వెల్ 24 పరుగులతో ఆడుతున్నారు.
మూడో వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
మహిపాల్ లామ్రోర్(1) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లి 42 పరుగులతో ఆడుతున్నాడు.
డుప్లెసిస్(38) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్‌సీబీ
28 పరుగులు చేసిన డుప్లెసిస్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 68 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కోహ్లి 38, మ్యాక్స్‌వెల్ ఒక్క పరుగుతో ఆడుతున్నారు.
ఆరు ఓవర్లలో ఆర్‌సీబీ 62/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కోహ్లి 36, డుప్లెసిస్ 25 పరుగులతో ఆడుతున్నాడు.
కోహ్లి హ్యాట్రిక్ ఫోర్లు.. ఆర్‌సీబీ 43/0
గుజరాత్‌తో మ్యాచ్ ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లి హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 21, డుప్లెసిస్ 21 పరుగులతో ఆడుతున్నారు.
3 ఓవర్లలో ఆర్‌సీబీ 26/0
మూడు ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. డుప్లెసిస్ 17, కోహ్లి 9 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్ష్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ కన్నా ఆర్‌సీబీకి కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గుజరాత్‌పై ఆర్‌సీబీ గెలిస్తేనే ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండడం ఆర్‌సీబీ అభిమానులను ఆందోళన పరుస్తోంది.
.@gujarat_titans skipper Hardik Pandya wins the 🪙 toss and elects to field in #RCBvGT!
Watch the action with #IPLonJioCinema - LIVE & FREE across all telecom operators 👈#EveryGameMatters #IPL2023 #TATAIPLpic.twitter.com/AkFYkCV5zq
— JioCinema (@JioCinema) May 21, 2023
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment