బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా స్థానిక చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆర్సీబీ ఖాతాను తెరవలేదు. దాంతో ఢిల్లీతో మ్యాచ్‌లో గెలుపు రుచిని చూడాలని ఆర్సీబీ భావిస్తోంది. మరొకవైపు ఢిల్లీ ఐదు మ్యాచ్‌లు ఆడి రెండింట గెలుపొందింది. ఇది ఆర్సీబీకి కీలకమైన మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని కోహ్లి నేతృత్వంలోని ఆర్సీబీ సిద్ధమైంది.సొంత మైదానం కావడంతో ఆర్సీబీ గెలుపుపై ఆశలు పెట్టుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఇది కోహ్లి గ్యాంగ్‌ను కలవర పెడుతోంది. అటు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆర్సీబీ బలంగానే ఉన్నప్పటికీ విజయాన్ని నమోదు చేయడంలో విఫలమవుతూ వస్తోంది. దీన్ని అధిగమించి విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది ఆర్సీబీ. ప్రజల్లో పర్యావరణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ జెర్సీతో కోహ్లి సేన బరిలోకి దిగుతోంది. 'గో గ్రీన్' పేరిట అవగాహన కల్పిస్తున్నారు.
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), పార్థివ్ పటేల్, ఏబీ డివిలియర్స్, మార్కస్ స్టోయినిస్, మొయిన్ అలీ, అక్షదీప్ నాథ్, పవన్ నేగీ, సౌతీ, నవదీప్ షైనీ, చహల్, సిరాజ్
ఢిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీషా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, రాహుల్ తెవాతియా, కొలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రబడా, ఇషాంత్ శర్మ, లామ్‌చెన్
Comments
Please login to add a commentAdd a comment