బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్(గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్) జట్టుపై ఇప్పటివరకూ 802 పరుగుల్ని నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌లో కోహ్లి 41 పరుగులు చేశాడు. ఫలితంగా క్రిస్ గేల్‌ను కోహ్లి అధిగమించాడు. కింగ్స్ పంజాబ్‌పై గేల్ 797 పరుగులు సాధించి ఇప‍్పటివరకూ రెండో స్థానంలో ఉండగా, దాన్ని కోహ్లి సవరించాడు.
ప్రస్తుతం గేల్ కింగ్స్ పంజాబ్ తరఫున ఆడుతున్నప్పటికీ, గతంలో అదే జట్టుపై అత్యధిక పరుగుల్ని నమోదు చేయడం గమనార్హం. ఇక ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో సురేశ్ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌పై రైనా 803 పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ప్రస్తుత మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కోహ్లి(41;33 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), అలీ(32;18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) మాత్రమే రాణించడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment