కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచించాడు..! | Umesh Yadav Trolled After Conceding 28 Runs Off Last Over Against SRH | Sakshi
Sakshi News home page

కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచించాడు..!

Published Sun, May 5 2019 11:37 AM | Last Updated on Sun, May 5 2019 12:01 PM

Umesh Yadav Trolled After Conceding 28 Runs Off Last Over Against SRH - Sakshi

డెత్‌ ఓవర్లలో తన బౌలింగ్‌ అధ్వానంగా ఉంటుందని ఉమేష్‌ యాదవ్‌ మరోసారి నిరూపించాడు. సన్‌రైజర్స్‌తో శనివారం జరిగిన ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్లో 28 పరుగులు సమర్పించుకొని ఆర్సీబీని కష్టాల్లోకి నెట్టాడు. తన స్పెల్‌లో మూడు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చుకున్న ఉమేష్‌ చివరి ఓవర్‌ను మాత్రం కాపాడుకోలేకపోయాడు. ఆ ఓవర్లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 23 పరుగులు సాధించి ఆర్సీబీకి 176 టార్గెట్‌ నిర్దేశించాడు. అయితే, పరుగుల వేట ప్రారంభించిన బెంగుళూరు ఆదిలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయినా హెట్‌మైర్‌ (47 బంతుల్లో 75; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), గురుకీరత్‌ (48 బంతుల్లో 65; 8 ఫోర్లు, సిక్స్‌) వీరోచిత పోరాటం చేశారు. ఇక చివరి 6 బంతుల్లో 6 పరుగులు చేయల్సి ఉండగా... నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఉమేశ్‌ (4 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) వరుసగా 2 ఫోర్లు బాది బెంగళూరును విజయతీరాలకు చేర్చాడు. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు ఆర్సీబీ విజయంతో ఐపీఎల్‌కు ముగింపు పలికింది.

కాగా, తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సిన సన్‌రైజర్స్‌కు ఉమేష్‌ భారీ పరుగులు ఇచ్చుకోవడంపై ఆర్సీబీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. నాలుగు ఓవర్లలో 46 పరుగులు ఇచ్చుకున్న అపర పేస్‌ మహనీయుడు అని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఆర్సీబీ తరపున ఆడుతూ ప్రత్యర్థి జట్లకు సాయం చేస్తుంటాడని తిట్టిపోస్తున్నారు. ‘విరాట్‌ కోహ్లి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఆలోచిస్తున్నాడు. ఉమేష్‌ చివరి ఓవర్లలో పనికిరాడు అని తెలియదా. అతని కోటా పవర్‌ప్లే ముగిసే వరకే కంప్లీట్‌ చేయాలి’ అని సూచిస్తున్నారు. ‘ఖచ్చితంగా చెప్తున్నాను. ఉమేష్ కన్నా నేనే బెటర్‌గా బౌలింగ్‌ చేయగలను’ అని మరొక అభిమాని చురకలంటించారు. ఉమేష్‌ దిండా అకాడెమీలో చేరాడా అని కొందరు ఎద్దేవా చేశారు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ పంజాబ్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్‌యాదవ్‌ నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులకు 3 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అనంతరం బెంగళూరు యాజమాన్యం ఉమేశ్‌ ఫొటోని ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. దిండా అకాడమీ? అదేంటి? అంటూ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన ఆర్సీబీ మాజీ బౌలర్‌ అశోక్‌దిండా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆర్సీబీని ఉద్దేశిస్తూ తనూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అందులో తన గణంకాలను చూపిస్తూ.. ‘ద్వేషించేవారి వల్ల నా గణంకాలు నిజమేనని తెలుస్తుంది. ఇలాంటివి ఆపి జాగ్రత్తగా ఉండండి. మీ అభిప్రాయాలు నిజాలు కావు. కాబట్టి మీ నోటికి నన్ను దూరంగా ఉంచండి’ అని పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement