కోల్‌కతా: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువగా చర్చనీయాంశమైన అంశం ఏదైనా ఉందంటే అది మన్కడింగ్ వివాదమే. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను కింగ్స్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్ మన్కడింగ్ చేయడం పెద్ద దుమారమే రేపింది. దీన్ని కొందరు సమర్ధించగా, మరికొందరు ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ విమర్శించారు. ఇది జరిగే చాలా రోజులే అయినప్పటికీ దాన్ని సమయం వచ్చినప్పుడల్లా ఆటగాళ్లు తమదైన శైలిలో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
శుక్రవారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ‘మన్కడింగ్’పై ఆట పట్టించే యత్నం చేశాడు. ఆర్సీబీ బ్యాటింగ్‌లో భాగంగా కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ వేసిని 18వ ఓవర్ ఆఖరి బంతికి స్టైకింగ్ ఎండ్‌లో స్టోయినిస్ ఉండగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కోహ్లి ఉన్నాడు. అయితే బంతి వేసేందుకు వచ్చిన నరైన్ బంతిని సంధించలేదు. అయితే కోహ్లి మాత్రం నరైన్ వైపు చూస్తూ.. ‘ నన్ను మన్కడింగ్ చేద్దామనే.. ఇదిగో నా బ్యాట్ క్రీజ్‌లోనే ఉంది.. చూడు’ అని అర్థం వచ్చేలా మోకాళ్లపై కూర్చొని మరీ నవ్వులు పూయించాడు. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోహ్లి శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
(ఇక్కడ చదవండి: వావ్.. కోహ్లి కొత్త నిక్‌నేమ్ బాగుంది!!)
Comments
Please login to add a commentAdd a comment