క్రికెట్‌లో వినూత్న షాట్లకు పెట్టింది పేరు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్.. టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్. గ్రౌండ్ నలువైపులా షాట్లు బాదే ఈ ఇద్దరు క్రికెటర్లు మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్స్‌గా పేరు పొందారు. స్విచ్ హిట్, స్కూప్ షాట్, స్క్వేర్‌కట్.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెట్ పుస్తకాల్లో లేని షాట్లను కూడా వీళ్లు ఆడి అభిమానులను అలరించారు. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇద్దరు తమ వినూత్న ఆటతీరుతో అభిమానుల మనసులను గెలుచుకున్నారు.
ఇప్పుడు మనం చెప్పుకునే బ్యాటర్ మాత్రం సూర్య, ఏబీడీలను మించిపోయాడు. వీరిద్దరు వికెట్ల ముందు ఉండే వినూత్న షాట్లు ఆడడంలో నేర్పరులు అయితే.. ఇతను మాత్రం రూల్స్‌కు విరుద్దంగా వికెట్ల వెనకాలకు వెళ్లి మరీ స్కూప్ షాట్ ఆడాడు. బౌలర్ బంతి వేసేవరకు వెయిట్ చేసిన బ్యాటర్ ఆ తర్వాత ఒక్కసారిగా వికెట్ల వెనక్కి వెళ్లి వికెట్ కీపర్ తలపై నుంచి స్కూప్ షాట్ కొట్టి తన చర్యతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదంతా ఎక్కడో కాదు మన దేశంలోనే ఒక లోకల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. వీడియో చూసిన అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ''మిస్టర్ 1080..''..''రూల్స్‌కు విరుద్దంగా క్రికెట్ ఆడి పరువు తీస్తున్నాడు.. దమ్ముంటే వికెట్ల ముందే ఉండి ఈ షాట్ ఆడి చూపించు'' అని సవాల్ చేశాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 28, 2023
I wish someone does this to me with tape ball or leather ball.
— Usman Asghar (@uasghar18) June 28, 2023
Mr 1080 😵
— ವಿಕ್ರಮ್ ಪ್ರಭು | Vikram Prabhu (@TheLostIndian18) June 29, 2023
Is that shot even legal?
చదవండి: అభిమానుల డిమాండ్; అశ్లీల వెబ్‌సైట్‌లో జాయిన్ అయిన ఫుట్‌బాలర్
మా వల్లే కిర్‌స్టన్‌కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్..
Comments
Please login to add a commentAdd a comment