క్రికెట్‌ను అమితంగా ప్రేమించే టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐకాన్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్ జీవితాన్ని క్రికెట్‌ను విడదీసి చూడలేమనేది అందరికి తెలిసిందే. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్‌లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్, రిటైర్‌మెంట్ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.