
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. అయితే భారత హెడ్‌కోచ్‌గా తప్పుకున్న తర్వా ద్రవిడ్ తన ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ మిస్టర్ డిఫెండ్‌బుల్ తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీని సందర్శించాడు. ఈ క్రమంలో అక్కడ గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్ సరదాగా క్రికెట్ ఆడాడు. టెన్నిస్ బాల్‌తో బౌలింగ్ కూడా ద్రవిడ్ చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా గతంలో ద్రవిడ్ ఎన్‌సీఏ హెడ్‌గా కూడా పని చేశాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 విజయం తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకున్నాడు. 2021 నుంచి 2024 వరకు ద్రవిడ్ భారత ప్రధాన కోచ్‌గా పనిచేశాడు.
Rahul Dravid playing cricket with the Ground Staffs of NCA. 🌟 pic.twitter.com/y2tXJKGNbW
— Johns. (@CricCrazyJohns) August 11, 2024