వైరల్‌ : రాత్రివేళ రోడ్డు పక్కన సచిన్‌.. | Sachin Playing Cricket On The Street of Mumbai At Midnight | Sakshi
Sakshi News home page

వైరల్‌ : రాత్రివేళ రోడ్డు పక్కన సచిన్‌..

Apr 17 2018 9:17 AM | Updated on Apr 17 2018 9:58 AM

Sachin Playing Cricket On The Street In Mumbai - Sakshi

వీధిలో క్రికెట్‌ ఆడుతున్న సచిన్‌

ముంబై : క్రికెట్‌ను అమితంగా ప్రేమించే టీమిండియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పినా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐకాన్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్‌ జీవితాన్ని క్రికెట్‌ను విడదీసి చూడలేమనేది అందరికి తెలిసిందే. చాలా మంది యువ క్రికెటర్లకు సచినే మార్గదర్శి. ప్రపంచ క్రికెట్‌లో తన పేరు మీద అనేక రికార్డులు నెలకొల్పిన సచిన్‌, రిటైర్‌మెంట్‌ తర్వాత కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

తాజాగా హోమ్‌ టౌన్‌ ముంబైలో రాత్రి సమయంలో సచిన్‌ ఓ రోడ్డు పక్కన సరదాగా క్రికెట్‌ ఆడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా, కొంత మంది యువకులు ఫీల్డింగ్‌ చేశారు. పరిసరాలను బట్టి అది విల్లే పార్లేలోని రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతమని తెలుస్తోంది. రోడ్డుపైనే క్రికెట్‌ ఆడుతుండటంతో వికెట్లుగా ప్లాస్టిక్‌ డివైడర్‌ని వాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement