ఇక ముంబై టి20 లీగ్‌ | Mumbai T20 league | Sakshi
Sakshi News home page

ఇక ముంబై టి20 లీగ్‌

Published Fri, Feb 23 2018 12:19 AM | Last Updated on Fri, Feb 23 2018 12:19 AM

Mumbai T20 league - Sakshi

సచిన్‌ టెండూల్కర్‌

ముంబై: క్రికెట్‌ లీగ్‌ల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో లీగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రాంతీయ లీగ్‌ల వంతు వచ్చినట్లుంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టి20 క్రికెట్‌ లీగ్‌లు మొదలైనట్లే... తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలోనూ ‘టి20 ముంబై లీగ్‌’కు రంగం సిద్ధమైంది. ముంబై క్రికెట్‌ సంఘం సౌజన్యంతో ‘ప్రాబబిలిటీ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఆధ్వర్యంలో మొదలవనున్న ఈ లీగ్‌కు  భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 11 నుంచి 21 వరకు వాంఖెడే స్టేడియంలో ఈ ‘టి20 లీగ్‌’ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో సచిన్‌ మాట్లాడుతూ ‘ముంబైకి ఇలాంటి లీగ్‌ల అవసరం ఎంతో ఉంది.

సుదీర్ఘ కాలంగా ముంబై క్రికెటర్లే పెద్ద సంఖ్యలో భారత క్రికెట్‌లో ప్రధాన పాత్ర పోషించారనేది వాస్తవం. ఈ స్థానిక లీగ్‌లో ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’గా నేనులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. తమ సత్తా చాటేందుకు కుర్రాళ్లకు ఇది చక్కని వేదిక’ అని అన్నారు. ముంబై గల్లీ కుర్రాళ్లు శివాజీ పార్క్, క్లబ్‌ల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వేదికైన వాంఖెడేలో మెరిసేందుకు ఇది మంచి అవకాశమని సచిన్‌ అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement