లండన్: మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో బ్రిటన్ గజగజ వణికిపోతోంది.
ఈ సీజన్‌లో ఐస్‌ల్యాండ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాట్స్‌వాల్డ్, బ్రిస్టల్, సౌత్ వేల్స్, హియర్‌ఫోర్డ్‌షైర్, కాంబ్రియా, షెఫీల్డ్ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది.
కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్‌లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్‌లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
లండన్ సహా సౌత్, సెంట్రల్ ఇంగ్లాండ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కాట్లాండ్‌లో మైనస్ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్ బ్లాస్ట్ ప్రభావమే’’ అంటున్నారు.
ఇదీ చదవండి: ఆంక్షలను ఎత్తేయడంతో.. అల్లకల్లోలంగా తయారైంది
Comments
Please login to add a commentAdd a comment