సరి-బేసితో ప్రజలకు ఇబ్బంది: హైకోర్టు
దేశ రాజధానిలో కాలుష్యం సమస్యకు పరిష్కారంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన సరి-బేసి కార్ల విధానానికి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊహించని విధంగా చుక్కెదురైంది. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ట్రయల్ రన్‌ను 15 రోజులకు బదులు వారం రోజులకే ఎందుకు పరిమితం చేయకూడదని ప్రశ్నించింది.
ప్రజలకు సరిపడ స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థ లేకుండానే ఇలాంటి పథకం చేపట్టినట్లు ప్రభుత్వం అంగీకరించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కాలుష్యం లెక్కలు ఎలా ఉన్నాయో కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.