ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి.
దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది.
"శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
- రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి
- ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి
- అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి.
- స్టోన్ క్రషర్స్ ఆపరేషన్‌ను మూసివేయండి
- ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి
- BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి.
- నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్‌లైన్‌లో బోధించండి.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment