Air pollution control
-
కాలుష్య కోరల్లో దేశ రాజధాని ఢిల్లీ (ఫొటోలు)
-
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నియంత్రణకు అధికారుల ఆంక్షలు
ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది. "శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి. స్టోన్ క్రషర్స్ ఆపరేషన్‌ను మూసివేయండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి. నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్లైన్లో బోధించండి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
కాస్త మెరుగైన ఢిల్లీ వాయు నాణ్యత
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత కాస్తంత మెరుగవడంతో కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. వాయు కాలుష్యం అత్యంత తీవ్రం (సివియర్) నుంచి అతి తీవ్రం (వెరీ పూర్)కు చేరుకుందని వివరించింది. దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ సంబంధ పనులపై నిషేధాన్ని తొలగించింది. కాలుష్యాన్ని వెదజల్లే ట్రక్కుల ప్రవేశానికి అనుమతించింది. గాలి దిశ మారడం, గాలి వేగం పెరగడంతో కాలుష్య తీవ్రత తగ్గినట్లు వివరించింది. ప్రస్తుతం చివరిదైన నాలుగో దశకు సంబంధించి ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ప్లాన్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)ని అనుసరించి ఢిల్లీలో ఆంక్షలు అమలవుతున్నాయని తెలిపింది. నగరంలోని 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) శుక్రవారం 405 కాగా శనివారానికి అది 319కి తగ్గిపోయిందని పేర్కొంది. -
Delhi's Air Pollution: కాలుష్యం కోరల్లో ఢిల్లీ ప్రజలు (ఫొటోలు)
-
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
ఢిల్లీలో మళ్లీ తీవ్రస్థాయికి వాయు కాలుష్యం
-
ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హుటాహుటిన రంగంలోకి ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది. మంటలు రేపుతున్న కాలుష్యం... పంజాబ్‌లో సెప్టెంబర్ 15–నవంబర్ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్‌లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది! వీటిని నియంత్రించాలని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు కోరుతున్నా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ మరియు నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్ పేర్కొన్నారు. కార్మికులకు భృతి వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్ ఫ్రం హోమ్ పనిచే యాలని, ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్ ప్రజలను కోరారు. -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పెట్రోల్ పోయరంట!
వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. నిన్నా మొన్నటి వరకు ఎయిర్ ఇండెక్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఇప్పుడు రెడ్ జోన్లోకి వెళ్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది ఢిల్లీ. దీంతో అక్కడి సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది ఢిల్లీ సర్కారు. అందులో భాగంగా పొల్యుషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే ఫ్యూయల్ బంకుల్లో పెట్రోలు , డీజిల్ పోయాలనే చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు. ఫ్యూయల్ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్ సర్టిఫికేట్ తమతో పాటు తెచ్చుకోవాలి. లేదంటే బంకుల్లో ఉండే పొల్యుషన్ టెస్టింగ్ కేంద్రాల దగ్గరు వెళ్లి ఈ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెట్రోలు లేదా డీజిల్‌ను కొనేందుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం అమలులో ఉండే లోటపాట్లు, ఇతర మార్పులు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తోంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోయింది, ముఖ్యంగా చలి కాలంలో అయితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే సామాజిక సంస్థలకు తోడు సుప్రీం కోర్టు సైతం ఢిల్లీలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఢిల్లీ సర్కారు తంటాలు పడుతోంది. -
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
తిరుమల గిరులకు కొత్త హంగులు.. కొండ మీదకి ఎలక్ట్రిక్ బస్సులు
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తిరుమల - తిరుపతిల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డరు దక్కించుకుంది. ఫేమ్–2 స్కీము కింద ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డును ఒలెక్ట్రా అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌కు ఏపీఎస్ఆర్టీసీ జారీ చేసింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 140 కోట్లు. 12 నెలల కాలంలో బస్సులను డెలివరీ చేయాలి. తిరుపతి కేంద్రంగా కాంట్రాక్టు వ్యవధిలో బస్సుల మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా నిర్వహిస్తుంది. నిర్దిష్ట మోడల్ ప్రకారం ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్సిటీ సర్వీసులుగా నడుపుతారు. కొత్త ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్ బుక్ సుమారు 1,450 బస్సులకు చేరింది. కాలుష్యం తగ్గిపోతుంది ‘సమర్థమంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, పుణె తదితర నగరాల్లో మా బస్సులు నడుస్తున్నాయి‘ అని ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. మేఘా గ్రూపు నుంచి ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ (ఎంఈఐఎల్) గ్రూప్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భాగంగా ఉంది. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణలోని షాబాద్ మండలంలోని పారిశ్రామిక పార్కులో 150 ఎకరాల స్థలాన్ని టీఎస్ఐఐసీ కేటాయించినట్లు స్టాక్ ఎక్సేంజీలకు ఒలెక్ట్రా తెలిపింది. బస్సు ప్రత్యేకతలు.. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ ఎయిర్ కండీషన్డ్ బస్సుల్లో డ్రైవర్ కాకుండా 35 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్బీ సాకెట్ వంటి సదుపాయాలు ఉంటాయి. లిథియం అయాన్ బ్యాటరీలతో పని చేసే ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్యను బట్టి దాదాపు 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి. చదవండి:ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? -
ఆ సిటీలో పొగ బండ్లకి ప్రత్యేక పన్ను! బెంబేలెత్తున్న వాహనదారులు
జీరో కార్బన్ ఎమిషన్స్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ పఠిస్తున్న మంత్రం. కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే లక్క్ష్యంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇంగ్లండ్ మరో అడుగు ముందుకేసింది. డీజిల్, పెట్రోల్ బండ్లతో రోడ్ల మీదకి వస్తే భారీ ఫైన్లు విధిస్తున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు. ప్రత్యేక పన్ను ప్రపంచలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా లండన్‌కి పేరు. అయితే ఈ నగరంలో కొన్ని ప్రాంతాలను అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించారు. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువ కాలుష్యం విడుదల చేసే వాహనాలు తిరిగేందుకు అనుమతి లేదు. ఈ నిబంధన ఉల్లంఘించి ఏదైనా వాహనం ఈ మార్గంలో ప్రయాణిస్తే వాటికి ప్రత్యేక పన్నుగా 12.5 పౌండ్లు విధిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో ఈ పన్ను దాదాపు రూ. 1200లుగా ఉంది. ఈ ఇంజన్లయితే ఓకే లండన్ నగరంలోని అల్ట్రా లో ఎమిషన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రయాణించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు పెట్రోలు వాహానాలైతే యూరో స్టేజ్ 4 ప్రమాణాలు పాటించాలని డీజిల్ వాహానాలైతే యూరో స్టేజ్ 6 ప్రమాణాలు పాటించాలని నిర్ధేశించాయి. ముక్కుపిండి యూరో స్టేజ్ 4, 6 ప్రమాణాల ప్రకారం తయారైన వాహనాలు కాకుండా పాత పెట్రోలు, డీజిల్ ఇంజన్‌తో నడిచే వాహనాలతో ఈ జోన్లలోని రోడ్లపైకి వస్తే 12.5 పౌండ్ల ప్రత్యేక పన్నుని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. మిగిలిన నగరాలకు కర్బన ఉద్ఘారాలను తగ్గించాలనే టార్గెట్‌తో మొదట బైకులు, స్కూటర్లపై ఈ ప్రత్యేక పన్ను విధించారు. సానుకూల ఫలితాలు రావడంతో ఇప్పుడు ఇతర వాహనాలకు విస్తరించారు. బెటర్ రిజల్ట్స్ వస్తే ఈ విధానాన్ని దేశంలోని ఇతర నగరాల్లోనూ అమలు చేయాలనే యోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. బాదేస్తున్నారు ఈ ప్రత్యేక పన్నుపై లండన్‌లో మిశ్రమ స్పందన వస్తోంది. ఇంట్లో నుంచి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత రకరకాల పనుల నిమిత్తం తిరగాల్సి ఉంటుందని, ఒక్కొసారి ట్రాఫిక్ జామ్స్ వల్ల ఆల్టర్నేట్ రూట్స్‌లో వెళ్తుంటామని, ఇలాంటి సమయంలో అల్ట్రా లో ఎమిషన్ జోన్లోకి వచ్చారంటూ ఈ ప్రత్యేక పన్ను విధించడం బాగాలేదని కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కాలుష్యం తగ్గించాలంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు. చదవండి : ఎలక్ట్రిక్ మార్కెట్లోకి హోండా మోటార్స్ -
వాయు కాలుష్య నియంత్రణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. ఇప్పుడున్న వాయు కాలుష్యాన్ని ఐదేళ్లలో కనీసం 30% తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. గాలిలో పీఎం10(పర్టిక్యులర్ మ్యాటర్/చిన్న ధూళి కణాలు), పీఎం 2.5(సూక్ష్మ ధూళి కణాలు) 60కి మించి ఉండకూడదు. కానీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో 70 నుంచి 80 వరకూ ఉంటున్నాయి. రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం వాహనాలు. వాటి నుంచి వెలువడే పొగ వల్లే గాలిలోకి ప్రమాదకర కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి. దేశంలో వాయు కాలుష్యం పెరుగుతున్న 142 నగరాల్లో రెండు(విశాఖ, విజయవాడ) మన రాష్ట్రంలో ఉన్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. వీటితో పాటు మిగిలిన 11 జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు: ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అక్కడి మున్సిపల్, రవాణా, పరిశ్రమల, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో ఇంప్లిమెంటేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ నగరాల్లో ఉన్న పీఎం 10, పీఎం 2.5 ఎంత ఉందో తెలుసుకుని దాన్ని 60కి తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీలు నిర్ణయించి అమలు చేస్తుంది. ఆ కేంద్రాల్లో కాలుష్యం ఎక్కువగా వస్తున్న హాట్ స్పాట్స్‌ను గుర్తించి దాన్ని తగ్గించేందుకు సూక్ష్మ ప్రణాళికలు రూపొందించి దానికి బాధ్యుల్ని నియమించింది. నగరాల్లో కార్యాచరణ ప్రణాళికలు, హాట్ స్పాట్స్‌లో సూక్ష్మ ప్రణాళికలను అమలు చేసేందుకు రూ.639 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థానిక సంస్థలు, పరిశ్రమల సీఎస్ఆర్ ఫండ్స్‌ను ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. మిగిలిన గ్యాప్ ఫండింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. మొత్తం సొమ్ములో రూ.274 కోట్లు విశాఖలో, రూ.232 కోట్లు విజయవాడలో వచ్చే ఐదేళ్లలో ఖర్చు చేస్తారు. మిగిలిన సొమ్ముతో 11 నగరాల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. జిల్లా కేంద్రాల్లో కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు నిరంతర వాయు కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల(యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు నగరాల్లోనే ఇవి ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో తొలిసారిగా ప్రతి జిల్లాకూ ఒక స్టేషన్ ఏర్పాటు కానుంది. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఒక్కో నగరంలో నాలుగైదు స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం క్లీన్ ఎయిర్ ఏపీ కింద పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సహకారం తీసుకుంటున్నారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ నగరాల్లో వాయు కాలుష్యాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో కాలుష్య నియంత్రణ మండలి ఒప్పందం చేసుకుంది. తిరుపతి, విజయవాడ, గంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు సంబంధించి తిరుపతి ఐఐటీ సహకారం తీసుకోనుంది. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు నగరాలకు సంబంధించి తిరుపతిలోని నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చి లేబొరేటరీ సహకారం తీసుకుంటారు. పక్కా యాక్షన్ ప్లాన్‌తో ముందుకు.. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.639 కోట్లతో పక్కా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. సిటీ స్థాయి ప్రణాళిక, ఎక్కువ కాలుష్యం విడుదలయ్యే చోట్ల సూక్ష్మ ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అవసరమైన నిధులిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలని ఆయన నిర్దేశించారు. మొట్టమొదటిసారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో వాయు కాలుష్యాన్ని తెలుసుకునే కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాయు కాలుష్యంపై ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు త్వరలో ఒక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. – అశ్వినికుమార్ పరిడ, చైర్మన్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి -
సిటీజన్ల కోసం స్వచ్ఛవాయువు..
ఊపిరి సలపని వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో తాజాగా స్మాగ్ టవర్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ముక్కుపుటాలు, శ్వాసకోశాలను దెబ్బతీసే వాహన కాలుష్యం నుంచి తక్షణ విముక్తికి ఈ టవర్లు ఉపయోగపడతాయి. ముంబయి, ఢిల్లీ ఐఐటీ నిపుణుల సహకారంతో రూ.20 కోట్ల అంచనా వ్యయంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తయారు చేసిన ఈ టవర్ 24 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇందులో 40 భారీ ఫ్యాన్లు, ఐదువేల ఫిల్టర్లు ఉంటాయి. ఇవి స్థానికంగా గాలిలో అధికంగా ఉండే కార్భన్‌మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ తదితర ఉద్ఘారాలను గ్రహించడంతో వాయు శుద్ధి జరుగుతుంది. కూడళ్లలో సిగ్నల్స్ వద్ద కొన్ని నిమిషాలపాటు ఆగే వాహనదారులకు కొద్దిసేపు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం దక్కుతుంది. ఢిల్లీ తరహాలో గ్రేటర్ పరిధిలోనూ వాయుకాలుష్యం బెడద తీవ్రంగా ఉంది. లక్షలాది వాహనాల రాకపోకలతో అత్యధిక వాయు కాలుష్యం వెలువడే పంజగుట్ట, ఆబిడ్స్, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్‌నగర్, పాశమైలారం, పటాన్చెరు, కూకట్పల్లి తదితర కూడళ్లలో స్మాగ్‌టవర్లను ఏర్పాటుచేసి సిటీజన్లకు స్వచ్ఛవాయువును సాకారం చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అవధులు దాటిన వాయుకాలుష్యం.. గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య సుమారు 60 లక్షలకు చేరువైంది. ఇందులో 15 ఏళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షలకు పైగానే ఉన్నాయి. వీటి ద్వారా భయంకరమైన పొగ వెలువడుతుంది. ఈ ఉద్గారాల్లో ఉండే నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్ తదితర ఉద్ఘారాలు అత్యధికంగా ఉంటాయి. అంతేకాదు..సూక్ష్మ ధూళికణాల మోతాదు ప్రతి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రోగ్రాములు దాటరాదు. కానీ మహానగరం పరిధిలోని పలు పారిశ్రామిక వాడలు సహా, ప్రధాన రహదారులపైసుమారు 80 కూడళ్ల వద్ద నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకల కారణంగా తరచూ ధూళి కాలుష్యం 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోనూ స్మాగ్‌టవర్ల ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నది నిపుణుల మాట. స్వచ్ఛ వాయువును అందించాలి నగరవాసులకు స్వచ్ఛ ఊపిరిని సాకారం చేసే బాధ్యత ప్రభుత్వానిదే. ఆర్టీఏ, పరిశ్రమలు, ట్రాఫిక్, పీసీబీ విభాగాల సమన్వయంతో టోక్యో తరహాలో క్లీన్ఎయిర్ అథారిటీని ఏర్పాటు చేయాలి. కాలం చెల్లని వాహనాలు రోడ్డెక్కకుండా చూడాలి. ఉద్ఘారాలను పరిమితికి మించి విడుదల చేస్తున్న పరిశ్రమలను కట్టడిచేయాలి. నగరంలో హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. అత్యధిక కాలుష్యం వెలువడే కూడళ్ల వద్ద స్మాగ్‌టవర్లు ఏర్పాటు చేయాలి. – జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త -
ఈ–వాహనాలకు ఆకర్షణీయమైన సబ్సిడీలు
ముంబై సెంట్రల్: రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈ–వాహనాలు) ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని అమలు చేయడం ప్రారంభించింది. ఈ కొత్త విధానంలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి రూ. 15 వేలు, నాలుగు చక్రాల వాహనాలు(ఫోర్ వీలర్స్)కొనేవారికి ఒక లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 డిసెంబర్ 31వ తేదీ లోపు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులకు అదనంగా మరో రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు అదనపు సబ్సిడీ లభిస్తుందని దీనిపై అవగాహన ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఏ కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ అందించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో పది శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ నూతన విధానం ప్రకారం ముంబై, పుణె, నాగ్‌పూర్, ఔరంగాబాద్, అమరావతి, నాసిక్ లాంటి నగరాల్లో నడిచే మొత్తం పబ్లిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను 25 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2025 వరకు రాష్ట్రంలోని ఏడు నగరాల్లో 2,500 ఛార్జింగ్ సెంటర్లను నెలకొల్పాలని అనుకుంటోంది. అంతేగాక, వచ్చే ఏప్రిల్ నుంచి కేవలం విద్యుత్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్, పెట్రోల్ ధరలతో పోల్చితే విద్యుత్ ధర చాలా తక్కువ. అంతేగాక ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించవు. దీంతో అనేక మంది వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే ప్రోత్సాహాకాల్లో భాగంగా రాబోయే ఆరు నెలల్లో కొనుగోలు చేసే లక్ష వాహనాలకు 25 వేల వరకు సబ్సిడీ లభించనుంది. మొదటి పది వేల నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుపై రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సబ్సిడీ దక్కనుంది. రిక్షా, గూడ్స్ వాహనాలు, టెంపో లాంటి వాహనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది. స్లో చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ఉండనుంది. స్లో చార్జింగ్‌లో వాహనాలు 6 నుంచి 8 గంటల్లో, ఫాస్ట్ చార్జింగ్‌లో 2 నుంచి 3 గంటల్లో చార్జింగ్ పూర్తి చేసుకుంటాయి. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని మహారాష్ట్ర ఫిక్కీ, ఈ–వాహనాల విభాగ టాస్క్‌ఫోర్స్ సభ్యురాలు సులజ్జ ఫిరోదియా–మోట్వాణీ, మరాఠా చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ విభాగ ఉపాధ్యక్షుడు దీపక్ కరండీకర్ స్వాగతించారు. -
ఢిల్లీకి కాలుష్యం కాటు
న్యూఢిల్లీ: బాణసంచాపై నిషేధం ఉన్నా ప్రజలు పట్టించుకోలేదు. కాలుష్యం తీవ్రతకు కరోనా మళ్లీ విజృంభిస్తుందని చెప్పినా వినిపించుకోలేదు. దీపావళి పర్వదినాన అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా టపాసుల మోత మోగుతూనే ఉంది. ఫలితంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో అత్యంత సూక్ష్మ ధూళి కణాలు పీఎం 2.5 కొన్ని ప్రాంతాల్లో 500 దాటి పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2 రోజుల్లో 32% పెరిగిన కాలుష్యం కాలుష్య నియంత్రణ మండలి అంచనాల ప్రకారం పీఎం 2.5 స్థాయి శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో 32 శాతం పెరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో గాలి నాణ్యతా సూచిలో పీఎం 2.5 స్థాయి 490 వరకు వెళ్లింది. 490 అంటే ఆ గాలిలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నట్టు లెక్క. ఆ సమయంలో పీల్చిన గాలితో ఆస్తమా వంటి వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ కాలుష్యంతో కరోనా వైరస్ కూడా విజృంభిస్తోంది. ఢిల్లీలో కాలుష్యాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం ఉదయం 9 గంటల వేళ పీఎం 2.5 ఏకంగా 545కి చేరుకుంది. ఇలా ఉండగా, ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమ్రంతి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. -
‘కోరల’తో వస్తోన్న ‘కాలుష్య–కమిషన్’
సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క ప్రాణాంతక కరోనా వైరస్ మరో పక్క అంతకన్నా ప్రాణాంతక కాలుష్యం దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న విషయం తెల్సిందే. దేశంలో కాలుష్య నియంత్రణ కోసం 22 ఏళ్ల క్రితం ఏర్పాటై నేటికీ నిద్రావస్థలో జోగుతున్న ‘ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ (ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) అథారిటి’ స్థానంలో ‘కమిషన్ ఫర్ ఏర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ముదావహమే! ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట దుబ్బలను తగులబెట్టడం వల్ల ఏర్పడుతోన్న కాలుష్యాన్ని అంచనా వేసి, దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించేందుకు రిటైర్డ్ జడ్జి మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిషన్‌ను సుప్రీం కోర్టు అక్టోబర్ 16వ తేదీన ఏర్పాటు చేయడం, కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకరావడానికి హేతువు కావచ్చు! చదవండి: ఐదేళ్ల జైలు.. కోటి జరిమానా శాశ్వత చర్యలకు శ్రీకారం చుట్టలేదు ఢిల్లీ సహా దేశంలో పలు నగరాల్లో కాలుష్యం నివారణకు గత కొన్నేళ్లుగా స్పందిస్తున్నది, చర్యలు తీసుకుంటున్నది సుప్రీం కోర్టు ఒక్కటే. దీపావళి పండుగకే కాకుండా పెళ్లిళ్లకు, ప్రారంభోత్సవాలకు బాణాసంచాను నియంత్రిస్తూ వస్తున్నది కూడా సుప్రీం కోర్టే. కాలుష్యం సమస్య ముందుకొచ్చినప్పుడల్లా ‘సుప్రీం కోర్టు చూసుకుంటుందిలే, మనకెందుకు?’ అన్నట్లు రాజకీయ, అధికార యంత్రాంగాలు ముసుగు తన్ని నిద్రపోతూ వచ్చాయి. కేంద్రానికి హఠాత్తుగా ఎందుకు కనువిప్పు కలిగిందేమోగానీ దేశంలో కాలుష్యాన్ని నియత్రించేందుకు 18 మంది సభ్యులగల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ హఠాత్తుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు కాలుష్యంపై చట్టం వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష ఈ కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను కేంద్రం నియమిస్తుండగా, సభ్యులను నలుగురు కేంద్ర మంత్రులు, ఓ క్యాబినెట్ కార్యదర్శితో కూడిన నియామక కమిటీ నియమిస్తుంది. కమిషన్ నియామకానికి సంబంధించి విడుదల చేసిన గెజిట్‌లో అయిదు అధ్యాయాలు, 26 సెక్షన్లు ఉన్నాయి. ఈ కమిషన్ ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తుందని అందులో పేర్కొన్నారు. అంటే వివరణ లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేకుండా స్వతంత్య్రంగా వ్యవహరిస్తుందని చెప్పడం కావచ్చు. కాలుష్యానికి కారణం అవుతున్న వారికి లేదా కాలుష్య చట్టాలను ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష, కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉండడం ఎంతైనా అవసరమే. ఈ కమిషన్‌ను దేశ రాజధాని ప్రాంతంతోపాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ ప్రాంతాల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉన్నందున తొలి ప్రాథమ్యం కింద వాటికే పరిమితం చేసి ఉండవచ్చు. ఆ ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నిర్మూలించాక, యావత్ దేశంలోని కాలుష్యాన్ని కూడా ఆ కమిషన్ రాష్ట్రాల సహకారంతో నిర్మూలించాలి. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలను అమలు చేసి చూపాలి. కాలుష్య నిర్మూలన కమిషన్‌కు సంబంధించి అంతా బాగుందిగానీ, ఇన్నేళ్లు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని కేంద్రం, పార్లమెంట్లో బిల్లుపెట్టి సమగ్ర చర్చ జరపకుండా ‘వాయు మేఘాల’ మీద ఆర్డినెన్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇందులో ఏమైనా మతలబు ఉందా ? కాలుష్యం నివారణకు మెక్సికో, లాస్ ఏంజెలెస్, లండన్, బీజింగ్ ప్రభుత్వాలు కూడా ప్రమాద ఘంటికలు మోగాకే స్పందించాయి. కాలుష్యమే విషం కనుక ‘ఆలస్యం అమృతం విషం’ అనడం చెల్లకపోవచ్చు! -
హైదరాబాద్ గాలి తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో లాక్డౌన్ విధించిన సమయంలో వాయుకాలుష్యం తగ్గడం వల్ల 630 అకాల మరణాల (ప్రిమెచ్యూర్ డెత్స్) నివారణతో పాటు 690 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర వైద్యసేవల ఖర్చు ఆదా అయినట్టు బ్రిటన్ సర్రే వర్సిటీ ‘గ్లోబల్ సెంటర్ ఫర్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్’, ఇతర విభాగాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో తేలింది. ఈ నగరాల్లోని వాహనాలు, ఇతర రూపాల్లో వెలువడిన పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం 2.5) హానికారక స్థాయిలను ఈ పరిశోధకులు పరిశీలించారు. ఐదేళ్ల వాయు కాలుష్య గణాంకాలతో బేరీజు దేశంలో లాక్డౌన్ విధించిన మార్చి 25 నుంచి మే 11 వరకు ఉన్న వాయు నాణ్యత తీరును, అంతకుముందు ఐదేళ్ల ఇదే కాలానికి సంబంధించిన గణాంకాలతో పోల్చిచూసిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. ఈ ఏడాదితో పాటు గత ఐదేళ్లకు సంబంధించిన సమాచారం, వివరాలను బేరీజు వేసినపుడు హైదరాబాద్‌తో సహా ఇతర నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు ఈ పరిశీలన తేల్చింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వాయునాణ్యతపై ఈ పరిశోధక బృందం పరిశీలన జరిపింది. ఈ అధ్యయన వివరాలు ‘ద జర్నల్ సస్టెయినబుల్ సిటీస్ అండ్ సొసైటీ’లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశీలన నిర్వహించిన కాలంలో హానికారక, విషతుల్యమైన వాయు కాలుష్యాలు ఢిల్లీలో 54 శాతం, ఇతర నగరాల్లో 24 నుంచి 32 శాతం వరకు, ముంబైలో 10 శాతం వరకు తగ్గినట్టు పరిశోధకులు వెల్లడించారు. ‘ఈ కాలంలో పీఎం 2.5 కాలుష్యం తగ్గుదల అనేది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలగించకున్నా, ఈ కాలుష్యం తగ్గుదల శాతాలు భారీగా ఉండడం ద్వారా మనం భూగోళంపై వాహనాలు, ఇతర రూపాల్లో కాలుష్యాన్ని పెంచడం ద్వారా ఎంత ఒత్తిని పెంచుతున్నామనేది స్పష్టమైంది’ అని సర్రే వర్సిటీ అధ్యయనం ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. లాక్డౌన్ పాఠాలు లాక్డౌన్ సందర్భంగా వాయుకాలుష్యం తగ్గుదలకు సంబంధించి జరిపిన పరిశీలన.. నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత మెరుగుకు ఏయే చర్యలు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను సూచిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ కాలంలో ఆంక్షలు, ఇతరత్రా రూపాల్లో చేపట్టిన చర్యల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవడంతో పాటు, మెరుగైన పరిస్థితుల సాధనకు ఎలాంటి విధానాన్ని రూపొందిస్తే మంచిదనే దానిపై సమీకృత విధానం ఉపయోగపడొచ్చునన్నారు. -
గుండెల నిండా గాలి పీల్చుకోండి!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. ఒకవైపు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వారిని ఆహ్లాదకర వాతావరణంలో నిద్రలేపుతుండగా, గతంలో ఎప్పుడూ లేనంతగా మెరుగైన గాలి వారి శరీరంలోకి చేరి ఉత్సాహపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. లాక్‌డౌన్‌తో వాహనాలు, ఇతరత్రా రూపాల్లోని కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడంతో వాయు నాణ్యత క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వాయునాణ్యత మెరుగ్గా రికార్డయింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌కు ముందు లాక్డౌన్ అమల్లోకి వచ్చిన వారం రోజుల తర్వాత నగరాల్లో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా గతేడాది (2019) మార్చి 29న వివిధ నగరాల్లోని వాయునాణ్యతతో.. ఈ ఏడాది మార్చి 29న అవే నగరాల్లోని గాలి నాణ్యతను పోల్చి చూడగా, పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వాయు నాణ్యత.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు సహా అన్ని వాహనాలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా గతంలో ఏ వేసవిలోనూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో వాయు నాణ్యత పెరిగింది. గత వర్షాకాలంలో రాష్ట్రంలో ఉన్న వాయునాణ్యత స్థాయిలో ప్రస్తుత పరిస్థితి కూడా ఉంది. సమీర్ యాప్ ద్వారా ఏక్యూఐ పరిశీలన.. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయం (రియల్‌టైం)లో పరిశీలించి ‘సమీర్‌యాప్’ద్వారా ఆ వివరాలను ఒకసూచీ ద్వారా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. తాజా వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెరుగైన వాయునాణ్యత నమోదు కాగా.. ఉత్తరాదిలో మాత్రం కొన్నిచోట్ల పరిస్థితులు మెరుగు పడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి ఎంతో నయంగా ఉంది. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో మాన్యువల్, ఇతరత్రా పద్ధతుల్లో మానిటరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలున్న సనత్‌నగర్, బొల్లారం, జూలాజికల్ పార్కు,హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ, పాశమైలారం, పటాన్చెరువులలో ఆటోమేటిక్ సాధనాల ద్వారా, మాన్యువల్‌గానూ గాలి నాణ్యతను నమోదు చేస్తుండగా, ప్రస్తుత లాక్డౌన్ కారణంగా మాన్యువల్ నమోదు జరగడం లేదు, గతంలో వేసవి సందర్భంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం వంద పాయింట్లకు పైబడి ఉండగా, ప్రస్తుతం వాయునాణ్యత 68 పాయింట్లుగా ఉంది. ఏపీ రాజధాని అమరావతి 54 పాయింట్లతో అత్యల్పంగా రికార్డ్ కాగా ఇతర నగరాల్లో ఎయిర్ క్వాలిటీ మెరుగ్గానే ఉంది. వాయునాణ్యత తీరు ఇలా... ఏక్యూఐలో 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛ మైన వాతావరణంతో పాటు అతినాణ్యమైన వాయువు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు లెక్కిస్తారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు మంచి వాయు నాణ్యత ఉన్నట్లు అంచనా వేస్తారు. మిగతా గణాంకాలు, వాటి ప్రమాణాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఎయిర్‌క్వాలిటీ లెక్కింపు ఇలా.. వాయు నాణ్యత సూచీ ప్రమాణాలు.. ఆరోగ్యంపై చూపే ప్రభావాలు ముదురు ఆకుపచ్చ రంగు 0–50పాయింట్లు గుడ్– అతి తక్కువ ప్రభావం లేత ఆకుపచ్చ: 50–100 సంతృప్తికరం– సున్నితులపై స్వల్పప్రభావం పసుపురంగు: 100–200 మోడరేట్– ఆస్తమా, గుండెకు కొంత ఇబ్బంది ఆరెంజ్: 200–300 పూర్– శ్వాసతీసుకోడంలో ఇబ్బందులు లేత ఎరుపు: 300–400 వెరీపూర్– శ్వాస తీసుకోవడంలో తీవ్రప్రభావం ముదురు ఎరుపు: 400–500 సివియర్– ఆరోగ్యవంతులపైనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో... (మార్చి 28 సాయంత్రం 4 గంటలకు అప్డేట్ చేసినప్పుడు) అమరావతి =54పాయింట్లు రాజమండ్రి =60 పాయింట్లు హైదరాబాద్ =68 పాయింట్లు తిరుపతి =65పాయింట్లు విశాఖపట్నం=88పాయింట్లు -
ఢిల్లీకి మళ్లీ కాలుష్యం కాటు
సాక్షి, న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దుప్పట్లో దేశ రాజధాని ఢిల్లీ ముసుగేసుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకరమైన స్థితికి దిగజారి పోయాయి. గురువారం రాత్రికి రాత్రే వాయు కాలుష్య సూచి 50 పాయింట్లు పెరిగిపోయి 459కి చేరుకుంది. శుక్రవారం రికార్డు స్థాయిలో 599కి చేరుకోవడంతో ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకంలో ఏర్పడిన పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ మండలి (ఈపీసీఏ) వాయు కాలుష్య సూచీ అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకుందని వెల్లడించింది. గత ఏడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి పండుగ సమయంలో బాణాసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. దీంతో ఢిల్లీ పీసీఏ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు చర్యలు ప్రకటించారు. అందులో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కూడా ఉంది. ఢిల్లీలో వాయు నాణ్యతను పర్యవేక్షించే 37 స్టేషన్లలో శుక్రవారం తెల్లవారుజాము సమయానికి ప్రమాదకరమైన సూచికలే కనిపించాయి. పొరుగు రాష్ట్రాలదే బాధ్యత: కేజ్రీవాల్ పంజాబ్, హరియాణాలో పంట వ్యర్థాల్ని ఇష్టారాజ్యంగా కాల్చడం వల్లే ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. కాలుష్యం తీవ్రతరం కావడంతో పాఠశాలల పిల్లలకు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేలా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి అంకుల్ అంటూ హరియాణా సీఎంలు అమరీందర్ సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లను ఉద్దేశించి పిల్లలంతా లేఖలు రాయాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50 లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావద్దని రాజధాని వాసులను సీఎం కోరారు. ఢిల్లీలో గాలి నాణ్యతా సూచీ (కాలుష్యం) పాయింట్లు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్తూ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ట్వీట్ చేసిన ఫొటో ఇది. -
అనుకోకుండా ఒకరోజు...
సాక్షి, హైదరాబాద్: నగరంలో బయటకొచ్చి రోడ్డుపై ప్రయాణించాలంటే హైదరాబాదీయులకు నిత్యం నరకమే. ఓవైపు సుమారు 50 లక్షలకుపైగా వాహనాల రాకపోకల రణగొణధ్వనులతో స్థాయికి మించి శబ్ద కాలుష్యం, మరోవైపు ఆ వాహనాల నుంచి వెలువడే దట్టమైన పొగ ఊపిరి సలపని పరిస్థితి, అధిక ధూళి కణాలతో కళ్లు మండేంత వాయు కాలుష్యం. కానీ, దసరా పండుగ రోజు మాత్రం నగరవాసులకు ఈ ఇక్కట్లు తప్పాయి. స్వచ్ఛమైన గాలితో ఊపిరి తీసుకున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే దసరా పండుగ రోజు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం 40 నుంచి 50% మేర తగ్గడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెలువరించిన తాజా కాలుష్య నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పీసీబీ ప్రమాణాల మేరకు ఘనపుమీటరు గాలిలో ధూళికాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలో పలు రద్దీ కూడళ్లలో సాధారణ రోజుల్లో 90 నుంచి 110 మైక్రోగ్రాముల మేర నమోదవుతుంది. దసరా రోజున నగరంలో 60 నుంచి 70 మైక్రోగ్రాముల లోపలే ధూళికాలుష్యం నమోదవడం విశేషం. ఇక శబ్దకాలుష్యం పీసీబీ ప్రమాణాల మేరకు 55 డెసిబుల్స్ దాటకూడదు. కానీ సిటీలో పలు ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో వాహనాల హారన్ల మోతతో 90 నుంచి 100 డెసిబుల్స్ మేర శబ్దకాలుష్యం నమోదవుతుండటంతో నగరవాసుల గూబగుయ్ మంటుంది. కానీ దసరా రోజు పలు ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం 50 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే నమోదవడంతో నగరవాసులు కాలుష్య విముక్తి పొంది పండగ చేసుకోవడం విశేషం. శబ్ద, వాయుకాలుష్యం తగ్గడానికి కారణాలివే గ్రేటర్ జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో సుమారు పదివేల కిలోమీటర్ల ప్రధాన రహదారులపై నిత్యం రాకపోకలు సాగించే అరకోటి వాహనాల్లో పండుగ రోజు సగం వాహనాలు కూడా రోడ్డెక్కలేదు. దీంతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు పీసీబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక మెజార్టీ నగరవాసులు పల్లెబాట పట్టడం, సిటీలో ఉన్న వారు సైతం ఇంటికే పరిమితమై ఇంటిల్లిపాదీ కలసి పండగ చేసుకోవడం కూడా కాలుష్యం తగ్గేందుకు కారణమైనట్లు చెబుతుండటం విశేషం. -
వాయు కాలుష్యంపై ఎన్నికల ప్రణాళికలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 20 వాయు కాలుష్య నగరాల్లో 14 కాలుష్య నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. అవి వరుసగా ఢిల్లీ, ఆగ్రా, ముజఫర్‌పూర్, జైపూర్, పాటియాల, వారణాసి, కాన్పూర్, ఫరిదాబాద్, గయా, జైపూర్, శ్రీనగర్, పట్నా, లక్నో, గుర్గావ్ నగరాలు. కాలుష్యం కారణంగా భారత్‌లో ఒక్క 2017 సంవత్సరంలోనే 10.24 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రకాలుగా సంభవిస్తున్న అకాల మరణాల్లో వాయు కాలుష్యం ఏడవ స్థానంలో ఉంది. ఈ కారణంగా మొట్టమొదటి సారిగా బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ లాంటి జాతీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో ఈ అంశం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ)’ను మిషన్లాగా వ్యవస్థీకతం చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. రానున్న ఐదేళ్ల కాలంలో దేశంలో కాలుష్యాన్ని 35 శాతం తగ్గిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వాస్తవానికి 2024 సంవత్సరం నాటికల్లా వాయు కాలుష్యాన్ని 20-30 శాతం వరకు తగ్గించడం ఎన్సీఏపీ లక్ష్యం. 2022 సంవత్సరం నాటికల్లా దేశంలో పంట దుబ్బులను తగులబెట్టడాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని బీజేపీ పేర్కొంది. ఇక వాయు కాలుష్యాన్ని జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ప్రస్తుతమున్న ఎన్‌సీఏపీని మరింత బలోపేతం చేస్తామని కూడా పేర్కొంది. దేశంలో వాయు కాలుష్యానికి ప్రమాణాలను నిర్దేశించి నియంత్రించేదుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది. ఎక్కువ వాయు కాలుష్యానికి కారణమవుతున్నవి ఏమిటో గుర్తించి, వాటిని నియంత్రిస్తామని కూడా తెలిపింది. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఇంత శాతం కాలుష్యాన్ని తగ్గిస్తామంటూ ఒక టార్గెట్‌ను మాత్రం ఖరారు చేయలేదు. దేశంలో వాయు కాలుష్య నివారణకు కృషి చేస్తామని వామపక్షాలు కూడా తమ ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్నాయి. అయితే పెద్దగా వాటి గురించి వివరించలేదు. వాయు కాలుష్య నివారణకు రాజకీయ పార్టీలు ఈమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం కూడా విశేషమని, రానున్న అసెంబ్లీ, నగర పాలక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆశిస్తున్నట్లు ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’కు చెందిన డొలాకియా అభిప్రాయపడ్డారు. 14 మంది ఎంపీల మౌనం ప్రపంచవ్యాప్తంగా 20 అత్యధిక కాలుష్య నగరాల్లో 14 నగరాలు భారత్‌లోనే ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నప్పటికీ గతే కొన్నేళ్లుగా ఈ నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సహా ఎంపీలంతా ఈ విషయంలో మౌనం పాటిస్తూ వచ్చారని ఢిల్లీలోని క్లైమెట్ ట్రెండ్స్ సంస్థ ‘పొలిటికల్ లీడర్స్ పొజిషన్ అండ్ యాక్షన్ ఆన్ ఏర్ క్వాలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వారణాసిలో సుందరీకరణ, రోడ్ల లాంటి సౌకర్యాలకు మోదీ, ఎంపీగా ప్రాధాన్యత ఇచ్చారని ఆ నివేదిక పేర్కొంది. వారణాసిలో గంగా ప్రక్షాళనకు ఆయన ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినా అది కూడా అంతంత మాత్రంగానే నడుస్తోందని తెలుస్తోంది. -
బస్సు, రైలు ప్రయాణం ఫ్రీ
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో గాలి కాలుష్యం ప్రధానమైంది. వ్యక్తిగత వాహనాలు ఎక్కువైపోవడం దీనికొకకారణం. మనిషి మనుగడకు ముప్పుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు తమకు చేతనైన ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఐరోపాలో బుల్లి దేశమైన లక్సంబర్గ్ ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవనుంది. త్వరలో లక్సంబర్గ్ ప్రభుత్వం దేశంలో ప్రజా రవాణాను ఉచితం చేయనుంది. అంటే ప్రభుత్వం నడిపే రైళ్లు, ట్రామ్‌లు, బస్సుల్లో టికెట్ కొనాల్సిన పని ఉండదు. అది అమల్లోకి వస్తే ప్రపంచంలో ఇలాంటి విధానం అమలు చేస్తున్న తొలి దేశం లక్సంబర్గే అవుతుంది. 2020 నుంచి దేశంలో ఉచిత ప్రజా రవాణాను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని గ్జేవియర్ బెటెల్ ప్రకటించారు. ఉచిత రవాణా వల్ల వ్యక్తిగత వాహనాలు తగ్గుతాయని దాంతో గాలి కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఆయన వివరించారు. అంతేకాకుండా దీనివల్ల ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందన్నారు. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మధ్య ఉన్న చిన్న దేశం లక్సంబర్గ్. జనాభా 6 లక్షలు. దేశంలో ప్రతి వెయ్యి మందికి 647 కార్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఏడాదిలో 32.21 గంటలు ప్రయాణాల్లోనే గడుపుతున్నారు. ప్రతిరోజూ పొరుగు దేశాల నుంచి లక్షా 90వేల మంది వచ్చి ఇక్కడ పనులు చేసుకుని వెళ్లిపోతుంటారు. వారిలో కొందరు సొంత వాహనాల్లో వస్తే, మరికొందరు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల దేశంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఎన్నికలప్పుడు ఇదీ కీలక ప్రచారాంశం కూడా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ఉచితం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇతర దేశాలను కూడా ఈ దిశగా ఆలోచించేలా చేస్తోంది. 2013 లో తలిన్, ఎస్తోనియా దేశాలు రాజధాని నగరాల్లో ఉ చిత రవాణా విధానాన్ని ప్రవేశపెట్టాయి. తలిన్‌లో ప్రజలు 2యూరోలతో హరిత రవాణా పాస్ కొను క్కుని అన్ని మున్సిపల్ బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఎప్పటి నుంచో అక్కడ ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి రూ.7లక్షలు ఆదా.. ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అమెరికన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(అప్టా) తెలిపింది. ఈ రంగంలో ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టే ప్రతి డాలరుకు 4 డాలర్లు తిరిగి వస్తుందని ఆప్టా తెలిపింది. దీనివల్ల గ్రీన్హౌస్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంది. సొంత వాహనాలను పక్కనపెట్టి ప్రభుత్వ వాహనాలు ఉపయోగించడం వల్ల అమెరికాలో ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదా చేయవచ్చని ఆప్టా అంచనా వేసింది. -
వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోండి
రాష్ట్రప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యావరణంపై అవగాహనకు జాతీయ వాయు నాణ్యత సూచిక త్వరలో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ఏర్పాటు కాలుష్యంపై పోరాటం నిరంతర ప్రక్రియ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని కోసం కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో మూడు సార్లు సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈ సమావేశాల్లో ఘన రూపంలోని చెత్త, కాలుష్య నియంత్రణ, ధూళి కణాల పెరుగుదలపై పర్యవేక్షణ, మురుగునీటి నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించామని తెలిపారు. వీటికి సంబంధించి ‘యాక్షన్ ప్లాన్’ను మార్చి 31లోగా సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పిందన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి నివేదిక తమకు అందలేదని, దాని కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, వీలైనంత త్వరగా వారు ప్రణాళిక తయారు చేసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో ఎక్కడ చూసిన కుప్పలుగా పేరుకుపోయిన చెత్త దర్శనమిస్తోందని, అలాగే మురుగునీరు పోవడానికి కూడా సరైన వ్యవస్థ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంత త్వరగా ప్రణాళిక తయారు చేసుకుని వస్తే అంతే వేగంగా సమస్యను పరిష్యరించేందుకు అవకాశముందని చెప్పారు. ఢిల్లీలో ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి పొరుగు రాష్ట్రాలు కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి డీజిల్, పెట్రోల్ వంటి వాహనాల్లో వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడం వల్ల దుమ్మూ ధూళి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని జవదేకర్ చెప్పారు. చీపుర్లతో కాదు... నగరంలోని రోడ్లను చీపుర్లతో కాకుండా యంత్రాలతో శుభ్రం చేయించాలని సూచించారు. వాయు కాలుష్యం మూలంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోందని, తద్వారా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యలన్నింటికి సమాధానంగా ‘జాతీయ వాయు నాణ్యత సూచిక’ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో వాయు నాణ్యతపై అవగాహన కల్పిస్తూ, వారిని కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు చేసేందుకు త్వరలో దేశంలోని 10 నగరాల్లో దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ 10 నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ సూచిక వల్ల ప్రజలకు వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తేలికగా అర్థమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ముందుగా ఈ విధానాన్ని దేశంలోని 10 నగరాల్లో ప్రారంభిస్తాం. రానున్న కాలంలో మరో 20 రాష్ట్రాల రాజధానుల్లో, 46 నగరాల్లో దీనిని విస్తరిస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రజల ఆలోచనా విధానంలో తప్పక మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ కాలుష్యంపై పోరాడాల్సిన అవసరముందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యావరణ మంత్రులు పాల్గొన్నారు. -
మార్నింగ్ వాక్ వద్దంటున్న వైద్యులు
ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాయుకాలుష్యం న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయాన్నే లేచి నడక, వర్కవుట్లు చేయడమో సర్వసాధారణం. అయితే ఈ చలికాలంలో అటువంటిమేమీ చేయొద్దని, ఒకవేళ చేస్తే ఆరోగ్యం సంగతి దే వుడెరుగు, అనారోగ్యం బారినపడడం తథ్యం. ఉదయపు వేళల్లో వీచే గాలి తాజాగా ఉంటుందని, అందువల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతామని అందరూ భావిస్తారు. ఈ ఆలోచన ఎక్కడైనా ఉపయోగపడుతుందేమో కానీ జాతీయ రాజధానిలో మాత్రం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పుగా పరిణమించే కాలుష్య కారకాలు గాలిలో సమ్మిళితమయ్యాయి. ఈ కారణంగా మీ ఊపిరితిత్తుల పనిసామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోవడం తథ్యమని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. మార్నింగ్ వాక్ చేయడమంటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమేనంటున్నారు. అందువల్ల ఉదయం పూట ఇంటికే పరిమితం కావాలని హితవు పలుకుతున్నారు. సాధారణంగా అయితే ఉదయం పూట గాలి అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ కలుషితమవుతుంది. అయితే నగరంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నగరంలోని దుమ్మధూళి కణాల స్థాయి ఉదయం వేళల్లోనే 2.5 శాతంగా నమోదవుతోంది. ఉదయం ఆరు గంటలనుంచి పది గంటలవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొగమంచు కారణంగా దృశ్యస్పష్టత తగ్గిపోతుందని, ఇందువల్ల కళ్లపై ఒత్తిడి పడుతుందని చెబుతున్నారు. ఈ విషయమై నగర వాతావరణ శాఖ అనుబంధ సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చి సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త గుఫ్రాన్బేగ్ మాట్లాడుతూ ‘సాయంత్రం ఏడు గంటలనుంచి ఉదయం ఏడు గంటలవరకూ నగర వాతావరణంలో ధూళికణాల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఉదయం పదిగంటలదాకా కొనసాగుతోంది’అని అన్నారు. వాయుకాలుష్య నియంత్రణకు చర్యలు: కేంద్ర మంత్రి జవదేకర్ న్యూఢిల్లీ: నగరంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేక ర్ గురువారం రాజ్యసభకు తెలియజేశారు. వాయుకాలుష్యం పెరుగుదల నగరంలో మరణాల సంఖ్యను పెంచుతుండడంపై అనేకమంది సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయుకాలుష్య నియంత్రణ, మరణాల శాతం తగ్గింపునకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాలుష్య శుద్ధికి సంబంధించిన ఉత్పత్తులకు ప్రోత్సాహమిస్తామన్నారు.