వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. నిన్నా మొన్నటి వరకు ఎయిర్ ఇండెక్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఇప్పుడు రెడ్ జోన్‌లోకి వెళ్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో ప్రమాదకర స్థాయి వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతోంది ఢిల్లీ. దీంతో అక్కడి సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. వాయు కాలుష్యం నియంత్రణలో భాగంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉంది ఢిల్లీ సర్కారు. అందులో భాగంగా పొల్యుషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే ఫ్యూయల్ బంకుల్లో పెట్రోలు , డీజిల్ పోయాలనే చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ తెలిపారు.
ఫ్యూయల్ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్ సర్టిఫికేట్ తమతో పాటు తెచ్చుకోవాలి. లేదంటే బంకుల్లో ఉండే పొల్యుషన్ టెస్టింగ్ కేంద్రాల దగ్గరు వెళ్లి ఈ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెట్రోలు లేదా డీజిల్‌ను కొనేందుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం అమలులో ఉండే లోటపాట్లు, ఇతర మార్పులు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తోంది ఢిల్లీ సర్కార్. ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోయింది, ముఖ్యంగా చలి కాలంలో అయితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే సామాజిక సంస్థలకు తోడు సుప్రీం కోర్టు సైతం ఢిల్లీలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఢిల్లీ సర్కారు తంటాలు పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment