ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండి! | Supreme Court asks Centre to devise programme in 48 hours | Sakshi
Sakshi News home page

ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండి!

Published Tue, Nov 8 2016 5:31 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఏం  చేస్తారో 48 గంటల్లో చెప్పండి! - Sakshi

ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండి!

దేశ రాజధాని న్యూఢిల్లీలో నెలకొన్న వాతావరణకాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో అత్యంత భయానకంగా, తీవ్ర విపత్కరస్థాయిలో వాతావరణ కాలుష్యం తాండవిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి విధానపరమైన చర్యలు చేపడుతారో 48 గంటల్లోగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఢిల్లీలో ప్రస్తుతమున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సునీతా నాయర్‌, వాతావరణ కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) పేర్కొన్న సూచనలను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నది. హస్తినలో ప్రస్తుత పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌ను 48 గంటల్లో తమకు తెలుపాలని కేంద్రాన్ని ఆదేశించింది. 
 
దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గి.. తీవ్ర కాలుష్యం ఆవరించుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. 48 గంటల్లో ఈ విషయమై కేంద్రం ఇచ్చే ప్రతిస్పందన ఆధారంగా న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులను వెలువరించే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement