న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని కేంద్రం హామీయిచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నెలలో 15 రోజులు మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని రాజ్ నాథ్ హామీయిచ్చారని చెప్పారు. మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా మినహాయింపు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు.
సింగిల్ వుమెన్ డ్రైవర్స్, రోగులను తరలించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి వాహనాల రాకపోకలను నియంత్రించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది.
'మంత్రులు, అధికారులకూ మినహాయింపు లేదు'
Published Wed, Dec 9 2015 6:31 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement
Advertisement