Schools To Remain Shut From Tomorrow Till Further Orders: రేపటి నుంచి ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాగా, ఆన్‌లైన్ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. (భారత్‌లో ఒమిక్రాన్ కలకలం)
ఇక పరీక్షలు సైతం యథావిథిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో పాఠశాలలను ఏ విధంగా తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి, ఆన్‌లైన్ క్లాస్‌లను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది.
ఢిల్లీలో మూతపడనున్న పాఠశాలలు
Published Thu, Dec 2 2021 5:59 PM | Last Updated on Thu, Dec 2 2021 6:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment