దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అత్యంత విషతుల్యంగా మారుతోంది. ప్రధానంగా శీతాకాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో బుధవారంతో పోలిస్తే.. గురువారం మరింత ప్రమాదకరంగా ఉంది. ఢిల్లీలో గాలి కలుషితవం కావడం వెనుక.. సమీప రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలో రైతులు తమ పంటను తగులబెట్టడం కూడా కారణంగా మారింది.