మంచిర్యాల:రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ముందస్తుగా సరిహద్దు పోలీసు అధికారులు ఇప్పటి నుంచే సరికొత్త విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ఆరు జి ల్లాల ఎస్పీలతో రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మద్యం అమ్మకాలు, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్‌జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు ప్రాంతాల గుర్తింపు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్ ఏరియా డామినేషన్ తదితర 13రకాల అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో పెద్దపెల్లి జిల్లా డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్, కుమురంభీమ్ జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్, జగి త్యాల ఎస్పీ భాస్కర్, భూపాలపల్లి జ్లిల్లా ఎస్పీ కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టీ.కర్ణాకర్‌రావు, సరి హద్దు ప్రాంతాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment