
మహాప్రస్థానంకు సందర్శకుల తాకిడి
మంచిర్యాలటౌన్: పట్టణంలోని కాలేజ్‌రోడ్డులో నిర్మించిన మహాప్రస్థానం(వైకుంఠధామం)కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. పచ్చని మొక్కలు, గడ్డితో పర్యావరణం ఉట్టిపడేలా అత్యాధునికంగా, గ్రీనరీతో నిర్మించడంతో దానిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సివి రామన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా మహాప్రస్థానంను సందర్శించారు. అక్కడున్న వసతులు, నూతన టెక్నాలజీని పరిశీలించి ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారు. కాగా, ఈ మహాప్రస్థానం ఈ నెల 14నుంచి వినియోగంలోకి రానుంది.