
సభకు గులాబీ శ్రేణులు దండుకట్టాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
రామకృష్ణాపూర్: వరంగల్‌లోని ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు దండుకట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లిలోని ఆయన స్వగృహంలో రజతోత్సవ సభ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి 60కి పైగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు డాక్టర్ రాజరమేశ్, బడికల సంపత్, సుదర్శన్‌గౌడ్, రామిడి కుమార్, జాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.