ఉపాధి హామీలో అవినీతి
► పనులు తక్కువ కొలతలు ఎక్కువ
► ధర్మారంలో రూ.68875,
► సైదాబాద్‌లో రూ.64877 రికవరీ
జమ్మికుంట రూరల్ : ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించగా సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 9వ, విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక జరిగింది. పలు గ్రామాలలో తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిపాదనలు చూపిన ఆధారాలను తనిఖీ బృందం బయట పెట్టింది. మండల స్థారుు అధికారుల పర్యవేక్షణ కొరవడడడంతో ఫీల్డు అసిస్టెంట్‌లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ధర్మారం గ్రామంలో వరద కాల్వ నిర్మాణ పనుల్లో తక్కువ పనికి ఎక్కువ ప్రతిపాదనలు తయారు చేయడంతో రూ.68875లను,సైదాబాద్‌లో బినామీ పేర్లతో సొమ్మును కాజేయగా రూ.64,877లను రికవరీకి సిద్ధం చేశారు. కనగర్తి గ్రామంలో గ్రామ ఫీల్డు అసిస్టెంట్ తన భర్తకు 84రోజుల పని దినాలు కల్పించి రూ.9991లను పొందినట్లు గుర్తించారు. దగ్గరి బంధువులకు మాత్రమే పని దినాలు కల్పించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వంతడుపుల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి జాబ్‌కార్డు ఇవ్వడాన్ని, వరద కాల్వ నిర్మాణంలో తక్కువ కొలతలను గుర్తించారు.
వావిలాల ఫీల్డు అసిస్టెంట్‌ను తొలగించాలని పలువురు గ్రామస్తులు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును అధికారులకు అందజేశారు. లక్ష్మాజిపల్లి సీఎస్పీ లావణ్య రూ.16 వేలను ఇప్పటికీ కూలీలకు చెల్లించలేదని గుర్తించగా చర్యకు నిర్ణరుుంచారు. ఎంపీడీవో పనితీరుపై డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో మొత్తం 32 గ్రామాలు ఉండగా సోమవారం రాత్రి వరకు 15 గ్రామాల పనితీరుపై ప్రజావేదిక జరిగింది. మిగతా గ్రామాల ప్రజావేదిక బుధవారం జరగనుందని అధికారులు తెలిపారు. ఎంపీపీ గంగారపు లత, ఏపీడీ రాంరెడ్డి, ఎంపీడీవో రమేష్, ఏపీవో రాణి, అసిస్టెంట్ విజిలెన్‌స అధికారి కొమురయ్య, స్టేట్ మానిటరింగ్ అధికారి అశోక్‌కుమార్, ఎస్‌ఆర్పీలు నవీన్, అనిల్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.