సీసీ కెమెరాలతో చోరీలకు చెక్
సీసీ కెమెరాలతో చోరీలకు చెక్
Published Mon, Aug 22 2016 11:44 PM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
విజయవాడ :
జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను ఎంచుకుని చోరీలకు పాల్పడే ఘరానా దొంగలు కృష్ణా పుష్కరాలకు వచ్చారు. అయితే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడి అధికారులు వారికి చెక్ పెట్టారు. ఇందుకు అధికారులకు సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగపడ్డాయి. ఎంతోమంది అంతర్రాష్ట్ర దొంగలు, నేరస్తులను అవి పట్టిచ్చాయి. వారి వద్ద ఉన్న ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. సోమవారం సీసీఎస్ పోలీసులు 27మంది అంతరాష్ట్ర నేరస్తులను పలు కేసుల్లో అరెస్టు చేశారు.
చోరీల వివరాలు..
∙ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్‌కు చెందిన నిందితులు వసంత, మంజుల, మరేశ్వరి, తారా, గాంధీ వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఈనెల 12న పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో నాంతాడును, 14న అదే ప్రదేశంలో వేరొక మహిళ మెడలో చైనును కట్టర్ సహాయంతో కత్తిరించారు.
∙ఒడిశా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన మీనాక్షి దాస్, దుర్గా దాస్, రాధికా దాస్, సంగీతా దాస్‌లు ముఠాగా ఏర్పడి ఈనెల 15న కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడలో బంగారం చైను కట్టర్ సహాయంతో అపహరించారు. ఇదే ముఠా 17 న పద్మావతి ఘాట్‌లో ఏమరుపాటుగా ఉన్న మహిళ చేతి సంచి లాక్కుని అందులో ఉన్న బంగారం నాంతాడును అపహరించారు.
∙ఒడిస్సా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన ప్రియ దాస్, పార్వతీ దీస్, గాయత్రీ దాస్, గోవింద్ దాస్‌లు వేరొక ముఠాగా ఏర్పడి ఈనెల 13న పద్మావతి ఘాట్‌లో ఒక దొంగతనం, 18 న బస్టాండ్ వద్ద ఒక బ్యాగును దొంగిలించారు. అలాగే 19 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కట్‌చేశారు.
∙ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సవీద్ అక్తర్, షాబద్‌జీలు ఈనెల 15 న పద్మావతి ఘాట్‌లో ఒక వ్యక్తి బట్టలు విప్పి స్నానానికి వెళ్ళగా బట్టలను అపహరించుకుపోయారు.
∙తెలంగాణా రాష్ట్రం హైదారబాద్‌కు చెందిన ముట్టాబత్తి పుష్ప, పూజ ఈ నెల 14 న కృష్ణవేణి ఘాట్‌లో ఓ యాత్రికుని సెల్‌ఫోన్, రూ.15వేల నగదు అపహరించారు. 18 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కూడా వారు అపహరించారు.
∙మెదక్‌కు చెందిన ఐదాకుల వెంకటమ్మ, తెలుగు లక్ష్మి, గారడి వెంకటేష్ ఒక ముఠాగా ఏర్పడి 14 న పద్మావతి ఘాట్‌లో ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాల సంచిని అపహరించారు. వారే 17న బస్టాండ్ వద్ద మరో మహిళ నుంచి సెల్‌ఫోన్, రూ.1000 నగదును చోరీ చేశారు.
∙వైజాVŠ కు చెందిన ఎండీ బాబ్జీ, మానుపాటి శివ, బాలంకి శ్రీను 13న కృష్ణవేణి ఘాట్‌లో, 14న పద్మావతి ఘాట్‌లో, 16న ఒన్‌టౌన్ రాజస్థాన్ స్కూలు సమీపంలో మూడు దొంగతనాలకు పాల్పడి మనీపర్సు, బ్యాగులు అపహరించారు. అదే విదంగా విజయవాడకు చెందిన కూరగంటి హోసన్న, దారుకోటయ్య, వైజాగ్‌కు చెందిన కట్టుమూరి అప్పారావు వేరొక బ్యాచ్‌గా ఏర్పడి 17, 18, 19 మూడు దొంగతనాల్లో మనీపర్సులు, బ్యాగులు అపహరించారు.
Advertisement