ప్రతీకాత్మక చిత్రం
భిక్కనూరు: మండల కేంద్రంలో సంచలనం కలిగించిన కవల పిల్లల అపహరణకు విఫలయత్నం పోలీసుల చొరవతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు ఎస్‌ఐ రాజుగౌడ్ తెల్పిన మాట్లాడుతూ మండల కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ అనే వ్యక్తి భిక్కనూరులో స్వీటు బండిని తోలుతూ మిఠాయిలను విక్రయిస్తాడు. అదే రాష్ట్రానికి చెందిన దినేష్ స్వీటు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు
రంజిత్ పిల్లలు శ్రీసాయి పబ్లిక్ స్కూల్‌లో చదువుతారు. దినేష్ పిల్లలు చైతన్య విద్యానికేతన్‌లో చదువుతున్నారు. రంజిత్ నాలుగు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లడంతో రంజిత్ భార్య రేష్మ తమ వద్ద పనిచేస్తున్న సుజాత కూతురు వెన్నెలను పిల్లలను స్కూల్ నుంచి తీసుకురమ్మని పంపించింది. వెన్నెల సాయి పబ్లిక్ స్కూల్‌కు వెళ్లాల్సి ఉంది. కాగా చైతన్య విద్యానికేతన్ స్కూల్‌కు వెళ్లి రాజస్థాన్ స్వీటు హోం పిల్లలను పంపించమని అక్కడి సిబ్బంది కోరింది.
సిబ్బంది ఈ విషయాన్ని హెచ్‌ఎం అశోక్‌కు తెలిపారు. దీంతో హెచ్‌ఎం దినేష్‌కు ఫోన్ చేసి మీ పిల్లలను పంపించుమన్నారా అని అడిగారు. అదేమి లేదని దినేష్ చెప్పాడు. దీంతో అశోక్ వెన్నెలను దబాయించడంతో వెన్నెల పరిగెత్తింది. ఆదివారం ఈ విషయమై దినేష్ భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై ఎస్‌ఐ రాజుగౌడ్ సీసీ కెమెరాలను పరిశీలించి వెన్నెలను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం పిలిపించాడు. విచారించి ఎస్‌ఐ నిజానిజాలు తెలుసుకున్నాడు. వెన్నెల ఒక పాఠశాలకు వెళ్లే బదులు వేరే పాఠశాలకు వెళ్లడంతో ఈ సమస్య తలెత్తిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment