ఉప సర్పంచ్‌ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా | Check Issue War Between Sarpanch And Deputy Sarpanch In Huzurabad | Sakshi
Sakshi News home page

ఉప సర్పంచ్‌ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా

Published Mon, Aug 16 2021 7:54 AM | Last Updated on Mon, Aug 16 2021 8:31 AM

Check Issue War Between Sarpanch And Deputy Sarpanch In Huzurabad - Sakshi

మాట్లాడుతున్న మహేందర్‌గౌడ్‌

సాక్షి, హుజూరాబాద్‌ (కరీంనగర్‌): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్‌ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ సర్పంచ్‌ నేరెళ్ల మహేందర్‌గౌడ్‌ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు.

అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్‌ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్‌పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్‌ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement