కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
Published Fri, Oct 7 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) :
ఓఎన్‌జీసీ కృష్ణా–గోదావరి బేసిన్ కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆ బేసిన్ హెడ్ ఫార్వర్డ్‌బేస్ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్పష్టం చేశారు. బేసిన్ మేనేజర్ మేనేజర్ డాక్టర్ పి.చంద్రశేఖరన్ నేతృత్వంలో సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని 46 పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆర్‌వో ప్లాంట్ల స్థాపనకు రూ.60 లక్షల చెక్కులను శుక్రవారం బేస్ కాంప్లెక్స్‌లో ప్రధానోపాధ్యాయులకు ఆయన అందించారు. కామరాజు మాట్లాడుతూ నిర్వహణపరమైన సవాళ్లను ఆధునిక సాంకేతికతో ఎదుర్కొంటూ, భద్రతలో రాజీపడకుండా పనిచేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement