పలు థియేటర్ల సీజ్
సాక్షి కథనానికి స్పందించిన జేసీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కొరఢా ఝళిపించారు. గతనెల 26వ తేదీన సాక్షిలో ‘సినీమాయ’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించారు. థియేటర్లలో వసతుల కొరత, అధిక ధరలకు విక్రయాలు, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం, ప్రేక్షకుల పడుతున్న ఇబ్బందులపై జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందిచే తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని రెవెన్యూ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఎస్‌వీసీ (రామలక్ష్మణ), సరస్వతీ థియేటర్, చంద్రమహాల్, సూర్యమహాల్ థియేటర్లలో డీటీ పి.రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఆయా థియేటర్లకు సంబంధించి బీ ఫారం లెసైన్సు, ఫైర్ సర్టిఫికెట్లు రెన్యువల్‌లలో ఉందో లేదో పరిశీలించారు.
ప్రధానంగా ఈసారి జేసీ భద్రతా పత్రాలపై దృష్టి సారించారు. ఫైర్ సేఫ్టీ లేని థియేటర్లను తక్షణమే సీజ్ చేయూలని ఆదేశించారు. ఈక్రమంలో ఇప్పటికే నరసన్నపేటలో రెండు, టెక్కలిలో రెండు, పొందూరులో ఒకటి, పలాసలో రెండు థియేటర్లు సీజ్ చేశారు. పాలకొండలో రెండో థియేటర్లను తనిఖీ చేశారు. అలాగే, అధిక ధరలకు తినుబండారాలు విక్రరుుంచడం, తదితర అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. ఒక్కసారిగా తనిఖీలు ప్రారంభం కావడంతో ఇంతవరకు అడ్డగోలుగా థియేటర్లు నడుపుతున్న యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి.
ఇప్పుడు కొందరు రెన్యువల్ కోసం పరుగులు తీస్తుండగా, కొందరు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నట్టు ఆ శాఖ ఎన్‌ఓసీ ఇస్తేగానీ రెవెన్యూ అధికారులు రెన్యువల్ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకోవాలన్నా యూజమాన్యాలకు కష్టమే. ఎప్పటి నుంచో అగ్నిమాపక అధికారులు యూజమాన్యాలకు సూచిస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు పరుగులు తీయూల్సిన పరిస్థితి వచ్చింది. జారుుంట్ కలెక్టర్ తీసుకున్న చర్యల పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా థియేటర్ల తనిఖీ
Published Wed, May 18 2016 12:26 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM
Advertisement
Advertisement