Joint Collector Vivek Yadav
-
సినిమా థియేటర్ల తనిఖీ
పలు థియేటర్ల సీజ్ సాక్షి కథనానికి స్పందించిన జేసీ శ్రీకాకుళం పాతబస్టాండ్: సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కొరఢా ఝళిపించారు. గతనెల 26వ తేదీన సాక్షిలో ‘సినీమాయ’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించారు. థియేటర్లలో వసతుల కొరత, అధిక ధరలకు విక్రయాలు, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం, ప్రేక్షకుల పడుతున్న ఇబ్బందులపై జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందిచే తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని రెవెన్యూ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఎస్వీసీ (రామలక్ష్మణ), సరస్వతీ థియేటర్, చంద్రమహాల్, సూర్యమహాల్ థియేటర్లలో డీటీ పి.రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఆయా థియేటర్లకు సంబంధించి బీ ఫారం లెసైన్సు, ఫైర్ సర్టిఫికెట్లు రెన్యువల్లలో ఉందో లేదో పరిశీలించారు. ప్రధానంగా ఈసారి జేసీ భద్రతా పత్రాలపై దృష్టి సారించారు. ఫైర్ సేఫ్టీ లేని థియేటర్లను తక్షణమే సీజ్ చేయూలని ఆదేశించారు. ఈక్రమంలో ఇప్పటికే నరసన్నపేటలో రెండు, టెక్కలిలో రెండు, పొందూరులో ఒకటి, పలాసలో రెండు థియేటర్లు సీజ్ చేశారు. పాలకొండలో రెండో థియేటర్లను తనిఖీ చేశారు. అలాగే, అధిక ధరలకు తినుబండారాలు విక్రరుుంచడం, తదితర అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. ఒక్కసారిగా తనిఖీలు ప్రారంభం కావడంతో ఇంతవరకు అడ్డగోలుగా థియేటర్లు నడుపుతున్న యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు కొందరు రెన్యువల్ కోసం పరుగులు తీస్తుండగా, కొందరు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నట్టు ఆ శాఖ ఎన్ఓసీ ఇస్తేగానీ రెవెన్యూ అధికారులు రెన్యువల్ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకోవాలన్నా యూజమాన్యాలకు కష్టమే. ఎప్పటి నుంచో అగ్నిమాపక అధికారులు యూజమాన్యాలకు సూచిస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు పరుగులు తీయూల్సిన పరిస్థితి వచ్చింది. జారుుంట్ కలెక్టర్ తీసుకున్న చర్యల పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అణుప్రాంతంలో సామాజిక అధ్యయనం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రణస్థలం మండలం అణువిద్యుత్ కర్మాగారం ఏర్పాటు చేయనున్న కొవ్వాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక అధ్యయనం చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అణు విద్యుత్ ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ అధికారులు, సామాజిక అధ్యయన సర్వే నిర్వహించే ఈపీటీఆర్ఐ సంస్థ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపీటీఆర్ఐ సంస్థ రూపొందించిన షోషల్ ఇన్ఫాక్టు అసెస్మెంట్పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తరువాత జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో 1983 కుటుంబాలున్నాయనీ, అందులో 7,960 మంది సభ్యులున్నారని వీరందరినీ అధ్యయనం చేయాలని చెప్పారు. ఇందుకోసం 37 అంశాలతో గల నమూనాను రూపొందించినట్టు వివరించారు. అధ్యయన సమయంలో స్వయం సహాయక మహిళా బృందాల సేవలు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. నూతన భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మంచి ధర వస్తుందని, దాంతోపాటు ప్యాకేజీ అందుతుందని చెప్పారు. అణువిద్యుత్ ముఖ్య ఇంజినీర్ జి.వి.రమేష్ మాట్లాడుతూ అధ్యయన సర్వే ఒక్కరోజులోనే పూర్తి చేయాలని, అందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే సెక్షన్-4 నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నందున సంబంధిత కుటుంబాల వివరాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అధ్యయన సంస్థ ఈపీటీఆర్ఐ సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ వి.సునీత మాట్లాడుతూ సర్వే చేసే విధానాన్ని వివరించారు. పునరావాస కార్యక్రమం కింద ప్రభుత్వం గతంలో ఇచ్చిన సర్వే ప్రశ్నావళిని అనుసరిస్తామని పేర్కొన్నారు. రామచంద్రాపురం, టెక్కలి, కోటపాలెం, జీరు కొవ్వాడ, గూడెం గ్రామాలలో సామాజిక అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ఎస్ వెంకటరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ఎస్.తనూజారాణి, కొవ్వాడ భూ సేకరణ అధికారి కె.మనోరమ, అదనపు ముఖ్య ఇంజినీరు పి.బి.శెట్టి, ఈపీటీఆర్ఐ పర్యవేక్షక ఇంజినీరు ఎ.గౌతంచంద్ర, పునరావాస కమిషనర్ కార్యాలయ తహశీల్దార్ సి.గంగిరెడ్డి, ఐటీ స్పెషలిస్ట్ డి.కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఓటేయలేదని రేషన్ కార్డులు ఇవ్వరట..
శ్రీకాకుళం పాతబస్టాండ్ : మేమంతా టీడీపీకి ఓటేయలేదట.. అందుకే రేషన్‌కార్డుల మంజూరుకు cతెలపదట.. ఇదెక్కడి న్యాయం సారూ.. ఇదేనా ప్రజాస్వామ్యపాలన... ఇలా అయితే అధికారులు ఎందుకు.. ఎమ్మెల్యేలు ఎందుకు.. చట్టాల పనేమిటంటూ జి.సిగడాం మండలంలోని మెట్టవలస గ్రామస్తులు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనరసింహంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని 58 అర్హతగల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు మంజూరుకు సిఫార్సు చేయడం లేదని ఆరోపించారు. గ్రీవెన్స్‌సెల్‌లో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, ఏజేసీ పి.రజనీకాంతారావు, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో జె.వసంతరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త ఎం.సునీల, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ అప్పలస్వామి తదితర అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. శ్రీకాకుళం పట్టణంలోని మదురానరగ్ కాలనీలో పార్కుగోడ కాలువలో కూలిపోవడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోందని, గోడ నిర్మించి, పార్కును ప్రజలకు అప్పగిస్తే సుందరంగా అభివృద్ధిచేస్తామని శ్రీనివాస అపార్టుమెంటు ప్రతినిధులు డి.వెంకటేశ్, కుమార్ వేనుగోపాల్ తదితరులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎచె ్చర్ల మండలం ఎస్.ఎం.పురం రెవెన్యూ ఫరీదుపేట పంచాయతీ పరిధిలో 2.03 ఎకరాల్లో వేసిన రియల్ ఎస్టేట్‌లో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు కె.అమ్మినాయుడు ఫిర్యాదు చేశారు. పట్టాదారు పాసుపుస్తకం మంజూరుకు లంచం తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవాలని లావేరు మండలం హనుమంతుపురం గ్రామానికి చెందిన డి.అక్కమ్మ కోరింది. జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంలో రాత్రి కాపలాదారుగా పనిచేస్తున్న తనను తహశీల్దార్ బలవంతంగా బయటకు పంపించార ంటూ శ్రీకాకుళానికి చెందిన ఉలుకు సరోజిని కలెక్టర్ వద్ద వాపోయింది. నకిలీ పాస్‌పుస్తకాలు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన కె.అప్పారావు ఫిర్యాదు చేశారు. అంత్యోదయ కార్డు మంజూరు చేయాలంటూ ఎల్.ఎన్.పేట మండలం ధనువాడ గ్రామానికి చెందిన కొయ్యాన తిరుపతిరావు అనే వికలాంగుడు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. తోటి డ్రైవర్లతో సమానంగా వేతనం ఇవ్వాలంటూ ఐటీడీఏలో పనిచేస్తున్న సీతంపేట మండలానికి చెందిన ఎల్.ప్రకాశరావు కోరారు. రోడ్డుపై ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని జలుమూరు మండలం రాణ గ్రామానికి చెందిన వాద సింహాచలం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నష్టపరిహారం అందజేయడలో వివక్ష చూపిస్తున్నారంటూ కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామానికి చెందిన ఉప్పాడ అప్పలనాయుడు ఫిర్యాదుచేశారు. ఎస్సీ రహదారిపై ఆక్రమణలు తొలగించాలని పొందూరు మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన వై.జగన్నాథరావు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కో కుటుంబానికి నాలుగు పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని నరసన్నపేట మండలం కంబకాయ గ్రామ సర్పంచ్ మహేశ్వరి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 12 వినతులు శ్రీకాకుళం సిటీ: జిల్లా పోలీసుకార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 12 వినతులు వచ్చాయి. ఓఎస్డీ అడ్మిన్ కె.తిరుమలరావు వచ్చిన వినతులను పరిశీలించారు. త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వచ్చిన వినతుల్లో సివిల్ తగాదాకు సంబంధించి నాలుగు, కుటుంబ కలహాలపై మూడు, పాత కేసు విషయమై ఒకటి, పాతవి నాలుగు ఉన్నాయి. కార్యక్రమంలో డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, టి.మోహనరావు, కె.వేణుగోపాలనాయుడు, దేవానంద్‌శాంతో, పెంటారావు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్లు ప్రసాదరావు, కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.