ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఒక్కో వార్డును, వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించామని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.