గ్యాస్‌ ‘గమనించండి’ | please check the gas cylinder | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ‘గమనించండి’

Published Fri, Oct 7 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

గ్యాస్‌ ‘గమనించండి’

గ్యాస్‌ ‘గమనించండి’

►   సిలిండర్‌ సీల్‌ను తనిఖీ చేయండి
►   బరువుందా తెలుసుకునేందుకు తూకం వేయించండి
►   అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి

కొవ్వూరునగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్‌ ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ డెలివరి చేసేందుకు బాయ్స్‌ తీసుకొచ్చారు. దానికి సీల్‌ లేదు. సీల్‌ ఎందుకు తొలగించారని బాయ్స్‌ను అడిగితే, వాచర్‌ లికేజీ ఉందేమోనని చెక్‌ చేసేందుకు సీల్‌ తొలగించామని చెప్పి సిలిండర్‌ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే సిలిండర్‌ నిర్ణీత బరువు లేదు. స్పింగ్‌ త్రాసు బాయ్స్‌ వెంట తెచ్చుకోకపోవడంతో తూకం వేయించుకోలేక పోయాడు.

అనంతపురం అర్బన్‌ : వంట గ్యాస్‌ సిలిండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా..? గ్యాస్‌ నిర్ణీత బరువు ఉందా లేదా...?  అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్‌ సిలిండర్లు సీల్‌ తొలగించి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో డెలివరీ బాయ్స్‌ చేతి వాటం ప్రదర్శిస్తూ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ తస్కరించే అవకాÔ¶ ం లేకపోలేదు. ప్రధానంగా విద్యావంతులు కాని వారికి ఇలాంటి సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

సీల్‌ ఉందా లేదో చూసుకోండి
గ్యాస్‌ సిలిండర్‌ నాబ్‌కు సదరు కంపెనీ సీల్‌ వేసి పంపుతుంది. అలా సీల్‌ వేసినవే తీసుకోవాలి. సీల్‌ని ఒకసారి చూడండి. అది  ఊడిపోయినట్లు ఉంటే తీసుకోవద్దు. దానికున్న సీల్‌ తొలగించడం నేరం. అలా డెలివరీ బాయ్స్‌ తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్‌ తొలగించి సిలిండర్‌ సరఫరా చేసినట్లయితే తక్షణం అధికారులు ఫిర్యాదు చేయండి.

స్రింగ్‌ త్రాసు తప్పని సరి
వంట గ్యాస్‌ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్‌ వెంట తప్పని సరిగా స్పింగ్‌ త్రాసు ఉండాలనేది నిబంధన. గహ అవసర సిలిండర్‌లో నికరంగా గ్యాస్‌ 14.200 కేజీలు, సిలిండర్‌ బరువు 15.300 కేజీలు మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్‌ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్‌ త్రాసు ద్వారా తూకం వేసి వినియోగదారునికి దాని బరువును చూపించి ఇవ్వాల్సి ఉంది. మీరు అందజేసిన సిలిండర్‌ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్‌ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లండి.

లీకేజి చెక్‌ చేయించుకోవాలి
సిలిండర్‌కు రెగ్యులేటర్‌ అమర్చే నాబ్‌లోని వాచర్‌ కొన్ని సందర్భాల్లో పాడై ఉంటుంది. అలాంటి వాటికి రెగ్యులేటర్‌ బిగించిన వెంటనే గ్యాస్‌ లికవుతుంది. సిలిండర్‌ తీసుకున్న వెంటనే  స్వయంగా సీల్‌ తీసేసి వాచర్‌ చెక్‌ చేయించుకోవాలి. గ్యాస్‌ లికవుతున్నట్లు గుర్తిస్తే తక్షణం వాచర్‌ వేయించుకోవాలి.

ఫిర్యాదు చేయండి
కంపెనీ వేసిన సీల్‌ లేకుండా గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేసినప్పుడు. లేదా తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్‌ నిరాకరించినప్పుడు వెంటనే మీరు జిల్లా పౌర సరఫరాల అధికారి ఫోన్‌ 8008301418 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
 
సీల్‌ తీసి డెలివరీ చేస్తే చర్యలు
గ్యాస్‌ సిలిండర్‌కుS కంపెనీ వేసే సీల్‌తోనే డెలివరీ చేయాలి. అలా చేయలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్‌ తప్పని సరిగా తమ వెంట స్పింగ్‌ త్రాసు ఉంచుకోవాలి. సిలిండర్‌ డెలివరీ చేసేప్పుడు తూకం వేసి వినియోగదారునికి అందజేయాలి.
– ప్రభాకర్‌రావు, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement