
అప్రమత్తం
ఎన్‌ఐఏ తాజా తనిఖీలతో మరోసారి కలకలం
‘ఉగ్ర’ కుట్రల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
వరుస పండగలతో.. సిటీలో పెరిగిన సందడి
సిటీబ్యూరో ఇస్తాంబుల్, బాగ్దాద్... ఆపై హైదరాబాద్ లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఏయూటీ పక్కా స్కెచ్ వేసినట్లు ఆధారాలు లభ్యం కావటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎన్‌ఐఏ నగరంలో చేపట్టిన తనిఖీల్లో మారణహోమాన్ని సృష్టించే వ్యూహం, బుల్లెట్లు బయటపడటంతో సిటీజనుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో నగరం నలుమూలలా విస్తృత సోదాలు ప్రారంభించారు. అనుమానిత ప్రాంతాల్లో బాంబు, డాగ్‌స్క్వాడ్‌లతో అణవణువూ గాలిస్తున్నారు. రానున్న బోనాలు, ఇతర పండుగల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు పోలీసులు సన్నద్ధమవుతు న్నారు. ప్రజలకు భరోసా కల్పించే పనులు ప్రారంభించారు.
మరోవైపు గడిచిన వారాంతంలో భారీ మారణ హోమానికి కుట్రపన్నిన ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ, శుక్రవారం బార్కాస్, తలాబ్‌కట్ట తదితర ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేసి బుల్లెట్లు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. గతంలో సిరియా వెళ్లే ప్రయత్నంలో పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ వారితో పాటు, ఇటీవలి హైదరాబాద్ విధ్వంసానికి స్లీపర్‌సెల్స్‌గా ఉపయోగపడ్డ వారి గుట్టును సేకరించే పనిలో ఎన్‌ఐఏ నిమగ్నమైంది. ఆన్‌లైన్ ద్వారా బాంబు తయారీ అప్రమత్తం
నేర్చుకున్న ఉగ్రవాదులు నగరంలోని వివిధ దుకాణాల్లో యూరియా పంచదార, మినరల్ యాసిడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్‌తో తదితర ఇంధనాలు కొనుగోలు చేసేందుకు ఎవరు సహకరించారు అన్న వివరాలపై నగర కౌంటర్ ఇంట లిజెన్స్‌తో పాటు ఎన్‌ఐఏ కూడా ఆరా తీస్తోంది.
ఆలయాలు, ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు
చిక్కడపల్లి: బోనాలు, ఇతర పండుగలు సమీపిస్తుండడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నార్త్ జోన్ బాంబు డిస్పోజల్ టీమ్ సిబ్బంది(బీడీటీమ్) పద్మారావు నగర్‌లోని కంచి కామకోఠి పీఠం, స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ గణపతి, అమ్మవారి, హనుమాన్ దేవాలయాల వద్ద మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్ ఇన్‌చార్జి సి.సురేష్, జెనరేష్, శంకరయ్య, మహేందర్‌లు ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా సీఎస్ డబ్ల్యూ న్యూ సిటీవింగ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయని, వీరికి తోడుగా డీసీపీ, ఆర్.ఐ, నలుగురు ఏసీపీలు, అడిషనల్ డీసీపీ, జాయింట్ సీపీలు కలసి ప్రత్యేక బాంబుస్క్వాడ్‌లతో సోదాలు చేస్తున్నాయని అధికారులు వివరించారు. ప్రధానంగా సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గణపతి దేవాలయం, మదీనా, ఆల్ఫా హోటల్, 31 బస్టాప్, అమెరికన్ కాన్సులేట్, బేగంపేట రైల్వే స్టేషన్, తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయం, పాస్‌పోర్ట్ ఆఫీస్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం తదితర ముఖ్యమైన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.