ఇందూరు, న్యూస్‌లైన్ : అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులకు ‘చెక్’ పడనుంది. పనులను పూర్తి చేయడంలో జాప్యం చేసే సర్పంచులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రద్యుమ్న పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో విధులను పట్టించుకోని సర్పంచులు ఎంతమంది ఉన్నారో జాబితాను తయా రు చేసే పనిలో పంచాయతీ అధికారులు ఉన్నారు. జిల్లాలో బీఆర్‌జీఎఫ్ పనులు విధించిన గడువులోగా పూర్తి కాకపోగా, కొన్ని చోట్ల అసలే ప్రారంభానికి నోచుకోని వైనంపై కలెక్టర్ ఇటీవల జరిగిన సమావేశాల్లో ఎంపీడీఓలను నిలదీశారు.
కొంతమంది వివిధ కారణాలు చెప్పగా సర్పంచులు పట్టించుకోవడం లేద ని, చెప్పాపెట్టకుండా పది,పదిహేను రోజులు సెల వుల్లో వెళ్తున్నారని, అందుకే పనులు పెండింగ్ పడిపోయినట్లు ఎక్కువ మంది ఎంపీడీఓలు వివరణ ఇచ్చా రు. కొంతమంది సర్పంచులు విధుల్లో ఉంటున్నప్పటికీ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయాలను కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సంబంధిత డివిజ నల్ పంచాయతీ అధికారికి, జిల్లా పంచాయతీ అధికారికి కనీస సమాచారం లేకుండా సర్పంచులు సెల వుల్లో వెళ్లడం, ఆ ప్రభావం బీఆర్‌జీఎఫ్ పనులపై పడుతుండటంతో కలెక్టర్ మండిపడ్డారు. డీపీఓ సురేశ్‌బాబుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. జనవరి 10 లోగా రూ. లక్ష లోపు, ఆపైన విలువ చేసే పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సహకరించని సర్పంచులపై క్రమ శిక్షణ చర్య లు తీసుకోవాలని, చెక్‌పవర్‌ను రద్దు చేయాలని సూచించారు. సమాచారం ఇవ్వకుండా సెలవులో వెళ్లిన సర్పంచులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ విషయాలను జిల్లాలోని అందరు సర్పంచులకు తెలియజేయాలని ఎంపీడీఓలకు చెప్పారు.
సర్పంచులూ... జర భద్రం
Published Fri, Jan 10 2014 4:33 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement