
ఎక్స్‌పో్లజివ్ గోడౌన్స్ తనిఖీ చేసిన కంట్రోలర్
యెటింక్లయిన్ కాలనీ : జీడీకే–5వ గని సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఎక్స్‌పో్లజివ్ గోడౌన్ ను కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌పో్లజివ్ డీకేపాండే గురువారం తనిఖీ చేశారు. ప్రస్తుతం వకీల్‌పల్లిగని సమీపంలోని గోడౌన్ ను నూతనంగా నిర్మిస్తున్న కట్టడాల్లోకి మార్చేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్‌పో్లజివ్‌ఆఫ్‌కంట్రోలర్ నూతన నిర్మాణాలు పరిశీలించారు.
కంట్రోలర్ వెంట ఆర్జీ–2 ఎస్‌ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేశ్, సివిల్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఎక్స్‌పో్లజివ్ స్టోర్స్ ఇన్ చార్జి మూర్తి, సెక్యూరిటీ అధికారి జానకిరాం తదితరులున్నారు.