సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రారంభ దశలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని బ్రెజిల్‌లోని పరిశోధకుల బృందం తేల్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం అణువులు జరారాకుసు పిట్ విషం ద్వారా ఉత్పత్తైన అణువు కోతి కణాలలో వైరస్ సామర్థ్యాన్ని 75శాతం నిరోధించింది. జరారాకుసో విషంలో ఉండే పెప్‌టైడ్ అణువులు వైరస్‌లో రెట్టింపవుతున్న ముఖ్యమైన ప్రోటీన్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని సావోపౌలో బుటాంటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో రాయిటర్స్‌తో చెప్పారు. అంతేకాదు ఈ పెప్‌టైడ్ అణువులను ల్యాబ్‌ల్లోనూ అభివృద్ధి చేయవచ్చని గైడో తెలిపారు.
బ్రెజిల్ అడవుల్లో జరరాకుసోను వేటాడటానికి బయలుదేరిన వ్యక్తుల పట్ల ఆయన అందోళన వ్యక్తం చేశారు. వారు ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కానీ పద్ధతి ఇది కాదనీ, కేవలం విషంతోనే కరోనాను నయం చేయలేమనేది గుర్తించాలన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నారు. కాగా బ్రెజిల్‌లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు సుమారు రెండు మీటర్ల పొడవు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment