సర్పంచ్‌ల హక్కుల కోసం ఉద్యమిస్తాం
Published Wed, Sep 11 2013 4:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్ :తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడగొండ సత్యరాజ్ వర్మ అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాల్లరాములు మెమోరియల్‌హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈనెల 2న హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని కలిసి ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల డిమాండ్‌లపై వినతిపత్రాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
జాయింట్ చెక్ పవర్‌లను రద్దు చేసి సర్పంచ్‌లకే చెక్ పవర్‌ను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లున్న గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేయాలన్నారు. సర్పంచ్‌లు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. ఐదు లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని, టీఏ, డీఏలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీలలో కార్యదర్శుల నియామకాన్ని చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు బండ లక్ష్మణ్, ప్రభాకర్, సత్యనారాయణ, మెట్టు నరేష్, సిరిసిల్ల పుష్ప, నందిపేట్ చిన్నయ్య, కళాశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement