మార్కెట్లోకి 'ట్రాయ్' కొత్త యాప్!
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొనే మరో కొత్త సాధనం మార్కెట్లోకి వస్తోంది. మై స్పీడ్ పేరిట టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సౌకర్యార్థం కొత్త యాప్ ను ప్రవేశ పెడుతోంది. యూజర్లు తమకు లభిస్తున్న మొబైట్ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కొత్త యాప్ సహాయపడుతుందని ట్రాయ్ తెలిపింది.
మార్కెట్లోకి మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకునేందుకు వీలుగా 'మై స్పీడ్' పేరిట ఈ కొత్త యాప్ ను జూలై 5వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ నూతన యాప్ ను మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉనట్లు వెల్లడించింది. కవరేజ్, డేటా, స్పీడ్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, హ్యాండ్ సెట్ వివరాలను కూడ ఈ కొత్త యాప్ వివరిస్తుందని ట్రాయ్... ప్రకటనలో వివరించింది.
దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాయ్.. వినియోగదారులకు అందుబాటులో మై స్పీడ్ ను తెచ్చే ప్రణాళికలు చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా యూజర్లు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొని, ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్ కు పంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని నగరాల్లో ఆపరేటర్లు తమ 3G కస్టమర్లకు కూడ ఎక్కువశాతం 2G స్పీడ్ ను అందిస్తున్నట్లు తమ డ్రైవ్ టెస్ట్ లో తెలుసుకున్న అధికారులు.. కస్టమర్లకు సహకరించే విధంగా మై స్పీడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు.