చెల్లని చెక్కు కేసుల్లో నిందితుడికి జైలు
విజయవాడ లీగల్ :
చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు, రూ.రూ.2,60, 000 జరిమానా విధిస్తూ ఒకటవ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. నగరంలోని రామలిం గేశ్వరనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద అదే ప్రాంతానికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి 2013, డిసెంబర్ ఒకటో తేదీన రూ.2,50,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే క్రమం లో శ్రీనివాసరెడ్డి 2014, మే 8వ తేదీన రూ. 2.50లక్షలకు చెక్కు ఇచ్చాడు. అయితే అతని బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కు చెల్లలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.
మరో కేసులోనూ శ్రీనివాసరెడ్డికి శిక్ష
మరొకరికి కూడా చెల్లని చెక్కు వచ్చిన కేసులో గుర్రాల శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడం తో ఆరు నెలలు జైలుశిక్షతోపాటు రూ.2,30, 000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సూర్యారావుపేటకు చెందిన బి.రాజు వద్ద శ్రీనివాసరెడ్డి 2013, మే 5న రూ.2.50లక్షలు అప్పు తీసుకున్నాడు. అతనికి కూడా చెల్లని చెక్కు ఇచ్చాడు. రాజు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువైంది. న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.