
‘గ్రూప్-2’ ప్రశాంతం
‘గ్రేటర్’లో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగారుు. ఎక్కువ మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థినీ తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల ఐరీస్‌ను తీసుకున్నారు. కొందరి ఐరీస్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యారుు.
పరీక్ష సమయం అరుుపోతుండటంతో ఐరీస్ నమోదు ఆపేసి నేరుగా హాల్‌లోకి పంపేశారు. కొందరు అభ్యర్థినులు తమ పసిబిడ్డలతో పాటు పరీక్ష కేంద్రానికి వచ్చారు. చిన్నారులను తండ్రి, అమ్మమ్మ వంటి వారు ఆడిస్తుండగా తల్లులు పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఒకరిద్దరు అభ్యర్థులు పరీక్ష మొదలయ్యే ముందు హడావుడిగా రాగా.. మరికొందరు పరీక్ష ప్రారంభానికి ముందు వరకూ కూడా కేంద్రం పరిసరాల్లో పుస్తకాలతో కుస్తీపడుతూ కనిపించారు.