
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు.
బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment