bomb threatening
-
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
-
హై అలర్ట్: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు. -
244 మందితో వెళ్తున్న గోవా విమానంలో బాంబు కలకలం!
అహ్మదాబాద్: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపులతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్ఎస్జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. #WATCH | Visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight passengers were deboarded after Goa ATC received a bomb threat. As per airport director, Nothing suspicious found. The flight is expected to leave for Goa probably b/w 10:30 am-11 am today.#Gujarat pic.twitter.com/dRBAEucYjy — ANI (@ANI) January 10, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక -
సీఎం కార్యాలయానికి బెదిరింపు సందేశాలు
న్యూఢిల్లీ: తెలుగులో కొద్ది రోజుల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో హీరో ఫేమస్ అవ్వడం కోసం రాజకీయ నాయకుడి మీద దాడి చేస్తాడు. సేమ్ ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ డెలివరీ బాయ్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. దాని కోసం ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయ నాయకులను బెదిరిస్తూ.. ఈ మెయిల్స్ పంపాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాలు.. ముంబైకి చెందిన అభిషేక్ తివారి అనే వ్యక్తి చదువు మధ్యలో మానేసి ప్రస్తుతం డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉద్యోగ జీవితం పట్ల నిరాశతో ఉన్న అభిషేక్ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని భావించాడు. అందుకోసం తొలుత ముంబైలోని ఓ జాతీయ పార్టీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ పంపాడు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కాదని భావించి ఈ సారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు నాయకులను చంపుతానని బెదిరిస్తూ.. మెయిల్స్ పంపాడు. అంతేకాక ఢిల్లీలో ఉన్న ఓ జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బాంబు పెట్టి పేల్చేయబోతున్నట్లు మెయిల్ చేశాడు. ఈ మెయిల్స్ గురించి సీఎం కార్యాలయ సిబ్బంది ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి నిందితుడు ముంబై నాలసొపరా ప్రాంతంలో ఉన్నాడని తెలియడంతో ఓ బృందం అక్కడకు వెళ్లి అభిషేక్ తివారీని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు ఒప్పుకున్నాడు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు???
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు
దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానం, దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మూడో నంబర్ ఫ్లాట్ ఫారం వద్ద బాంబులు అమర్చినట్లు ఆదివారం మద్యాహ్నం ఓ అగంతకులు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, సివిల్ పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే స్టేషన్ లోనేకాక పరిసర ప్రాంతాల్లోనూ పేలుడు పదార్థాలేవీ లభించకపోవడంతో అది ఫేక్ కాల్ గా భావించి ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఫోన్ కాల్ ఆధారంగా తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తి.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లికి చందిన బాలయ్యగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.